మీరు సమోసా ప్రియులా.. అయితే ఇకపై తినే ముందు ఇవి తెలుసుకోండి..!

భారతదేశవ్యాప్తంగా అత్యంత ప్రసిద్ధి చెందిన స్నాక్ ఐటమ్స్ లో సమోసా( Samosa ) ముందు వరుసలో ఉంటుంది.పిల్లల నుంచి పెద్ద వరకు దాదాపు ప్రతి ఒక్కరు సమోసాల‌ను ఇష్టంగా తింటుంటారు.

 Negative Health Effects Of Eating Samosas Details, Samosas, Samosa, Samosa Side-TeluguStop.com

సాయంత్రం అయ్యిందంటే చాలు కరకరలాడే సమోసాలను లాగించేస్తుంటారు.ఆఫీసుల్లో కూడా భోజనం తర్వాత స్నాక్స్ టైంలో ఎక్కువగా సమోసాలనే ప్రొవైడ్ చేస్తుంటారు.

అయితే సమోసా ప్రియులు కచ్చితంగా కొన్ని విషయాలు తెలుసుకోవాలి.

సమోసాలు తినడానికి రుచికరంగానే ఉండవచ్చు.

కానీ ఆరోగ్యపరంగా అవి అందించే ప్రయోజనాల కన్నా నష్టాలు ఎక్కువగా ఉంటాయి.సమోసాలు ఎక్కువగా కేలరీలు( More Calories ) మరియు కొవ్వులు కలిగి ఉంటాయి.

అందువల్ల అమితంగా తింటే భారీగా బ‌రువు పెరుగుతారు. చ‌ర్మం పై మొటిమలు కూడా ఎక్కువగా వస్తాయి.

సామోసాల కోసం ప్రధానంగా మైదా పిండిని ఉప‌యోగించి తయారు చేశారు.మైదా వంటి శుద్ధి చేసిన పిండిలో ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉండ‌వు.

పైగా మైదాలో అధిక గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది.ఇది రక్తంలో అధిక చక్కెర స్థాయిలు మరియు టైప్ 2 డయాబెటిస్‌కు( Type-2 Diabetes ) దారితీస్తుంది.

మైదా జీర్ణ వ్యవస్థపై ప్రభావం చూపించి మలబద్ధకం, కడుపు నొప్పి వంటి సమస్యలను సృష్టిస్తుంది.

Telugu Bad Cholestrol, Tips, Latest, Samosa, Samosa Effects, Samosas, Type Diabe

సమోసాల్లో మసాలాలు మరియు నూనెల కలయిక కడుపు లైనింగ్‌ను చికాకుపెడుతుంది.గుండెల్లో మంట మరియు యాసిడ్ రిఫ్లక్స్‌కు దారితీస్తుంది.అలాగే ఆయిల్ లో వేయించ‌డం వ‌ల్ల‌ సమోసాలు ట్రాన్స్ ఫ్యాట్స్ ను కలిగి ఉంటాయి.

ఇవి ర‌క్తంలో బ్యాడ్ కొలెస్ట్రాల్ ను భారీ గా పెంచుతాయి.ఇది గుండె సమస్యలకు కార‌ణం అవుతుంది.

Telugu Bad Cholestrol, Tips, Latest, Samosa, Samosa Effects, Samosas, Type Diabe

ప‌దే ప‌దే వాడిన నూనెలో లేదా సరిగ్గా నిలవ‌ చేయని నూనెలో వేయించిన సమోసాలు తింటే ఫుడ్ పాయిజనింగ్‌కు కారణమవచ్చు.అంతేకాకుండా అధికంగా స‌మోసాలు తింటే స్ట్రోక్, పొత్తి క‌డుపు కొవ్వు, మ‌ధుమేహం, ర‌క్త‌పోటు వంటి స‌మ‌స్య‌లు వ‌చ్చే రిస్క్ కూడా పెరుగుతుంది.కాబట్టి సమోసాలతో మ‌రీ ముఖ్యంగా బ‌య‌ట దొరికే స‌మోసాల‌తో జర జాగ్రత్త.వీలైనంత వ‌ర‌కు ఇంట్లోనే గోధుమ‌పిండి, ఫ్రెష్ ఆయిల్ ను ఉప‌యోగించి హెల్తీ ప‌ద్ధ‌తిలో స‌మోసాల‌ను తయారు చేసుకుని ఆస్వాదించండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube