ప్రజలకు ఎక్కడైనా సరే ఇబ్బందులు తలెత్తితే దాన్ని పరిష్కారం కోసం పోలీస్ స్టేషన్ కు వెళ్లడం పరిపాటే.అదే పోలీసులే ఇబ్బందికరంగా మారితే పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించండి.
తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో( Rajahmundry ) బొమ్మూరు పోలీస్ స్టేషన్ పని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.పోలీస్ స్టేషన్లో డ్యూటీలో ఉన్న మహిళా హోంగార్డు పై( Women Homeguard ) అర్ధరాత్రి చేయి చేసుకున్న అసభ్యకరమైన ఘటన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
ఈ సమయంలో మహిళా హోంగార్డు తన సెల్ ఫోన్ లో విషయాన్ని రికార్డు చేయడంతో ఈ విషయం కాస్త బయటపడింది.ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు చూస్తే.
తూర్పుగోదావరి జిల్లా( East Godavari District ) రాజమండ్రి లోని బొమ్మూరు పోలీస్ స్టేషన్ లో దుశ్చర్యకరమైన ఘటన జరిగింది.మహిళ హోంగార్డు ఈ విషయాన్ని ఇందులో రికార్డు చేయడం తర్వాత దానిని ఉన్నత అధికారులకు చేరవేసింది.దీంతో ఎస్పీ ఆదేశాలతో సదరు కానిస్టేబుల్ పై( Constable ) ఎఫ్ఐఆర్ నమోదు చేసి కానిస్టేబుల్ ను సస్పెండ్ చేశారు.ఉన్నత అధికారులు.డిసెంబర్ 8వ తారీకు జరిగిన ఈ ఘటనలో నైట్ డ్యూటీ లో ఉన్న మహిళ హోంగార్డును పోలీస్ కానిస్టేబుల్ ప్రసాద్( Police Constable Prasad ) ఆమె వద్దకు వచ్చాడు.ఒంటరిగా ఉన్న ఆమెతో అతడు అసభ్యకరంగా మాట్లాడి, ఆమె చేయి పట్టుకునేందుకు ప్రయత్నించాడు.
అయితే ఆ సమయంలో బాధిత హోంగార్డు కానిస్టేబుల్ సాగర్ ప్రసాద్ ను వ్యతిరేకించడం కనపడుతుంది.దీంతో పోలీస్ కానిస్టేబుల్ అక్కడ నుంచి వెళ్లిపోతాడు.ఈ విషయాన్ని మొత్తం హోంగార్డు తన భర్తతో కలిసి మరుసటి రోజు ఉదయాన జిల్లా పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది.దాంతో సదరు కానిస్టేబుల్ పై సస్పెండ్ చర్యలు తీసుకున్నారు పోలీసు ఉన్నత అధికారులు.
ఈ వీడియోని చూసిన సోషల్ మీడియా వినియోగదారులు రకరకాలుగా స్పందిస్తున్నారు.అంత పెద్ద వయసులో అది కూడా పోలీస్ ఉద్యోగంలో ఉండి ఇలాంటి పనులు చేయడం ఎంతవరకు సబబు అంటూ కానిస్టేబుల్ తో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.