అవసరాల నుంచి ఆవిష్కరణలు పుడతాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఆవిష్కరణ అంటే తలపండిన ఇంజనీర్లో లేదంటే శాస్త్రవేత్తలో కాదు మామూలు వ్యక్తులు కూడా సృష్టిస్తుంటారు.
మన ఇండియాలో అయితే కొత్త ఆవిష్కరణ ఎప్పటికప్పుడు వెలుగులోకి వస్తూనే ఉంటాయి.కష్టమైన సమస్య వచ్చినప్పుడు వాటికి సరైన పరిష్కారం కనిపెట్టడంలో మన ఇండియన్స్ ముందుంటారు.
దేశీ జుగాడ్స్‌తో( Desi Jugaad ) పేరిట ఇలాంటి ఇన్నోవేషన్ ఇప్పటికే చాలా వైరల్ అయ్యాయి.తాజాగా అలాంటి మరొక వీడియో ఇన్‌స్టా వేదికగా
ఈ క్లిప్ లో ఒక యువకుడు ట్రాక్టర్ ఇంజన్( Tractor Engine ) లేకుండానే ట్రాలీని( Trolley ) ఈజీగా తనతో పాటు తీసుకెళ్లాడు మామూలుగా ట్రాలీ లేదా ట్రాక్టర్ ట్రక్కు అనేది ట్రాక్టర్ ఇంజన్ ఉంటే మాత్రమే ముందుకు కదులుతుంది.
కానీ దానికి కూడా ట్రాక్టర్ ఇంజన్ కావాలా అన్నట్లు ఈ యువకుడు ఒక కొత్త ఆలోచన చేశాడు.అదేంటంటే అతను తన పాత వేగనార్( Wagon R Car ) కారును ట్రాక్టర్ ఇంజిన్‌లా వాడేసాడు.
@jugadufamily ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ షేర్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం కొన్ని లక్షల వ్యూస్ తో విపరీతంగా వైరల్ అవుతోంది.వీడియో ఓపెన్ చేయగానే మనకు వ్యాగన్ ఆర్ కారు కనిపిస్తుంది.దాని వెనుక భాగాన్ని కట్ చేసినట్లు ఉన్నారు.దాంతో అది టూ వీలర్ లా తయారయ్యింది.ఆ కారు వెనుక భాగానికి ట్రాక్టర్ ట్రాలీని లాగే కొక్కెం అమర్చారు.ఇంకేముంది ఆ కారు కొక్కానికి ట్రాక్టర్ ట్రక్కు అమర్చేసి హాయిగా వెళ్ళిపోయాడు.
ఆ దృశ్యం చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది.
ఈ వింత జుగాడ్‌ను ఒకరు వీడియో తీసి షేర్ చేశారు.ఈ వీడియోలో మనం ఒకటి గమనించవచ్చు.అదేంటంటే, ఈ ట్రక్కులో ఏమీ లేదు.
నిజానికి లోడ్ చేసి ఉన్న ట్రక్కును లాగ గలిగే కెపాసిటీ ఆ మారుతి కారుకి( Maruti Car ) ఉండే అవకాశమే ఉంది.ఆ విషయం పక్కన పెడితే ఈ వీడియో మాత్రం పెద్ద చర్చకు, ఆశ్చర్యానికి గురి చేసింది.
కొందరు ట్రాక్టర్ ఇంజన్లు మూతపడతాయేమో అని సరదాగా కామెంట్ పెట్టారు.కొందరు వాట్ ఏ క్రియేటివిటీ అన్నారు.ఇంకొందరు బ్రేక్ అప్లై చేస్తే ట్రక్కు వచ్చి కారుకు బలంగా గుద్దుకుంటుందని దీనివల్ల కారు కంట్రోల్ తప్పే ప్రమాదం ఉందని అన్నారు.దీన్ని మీరు కూడా చూసేయండి.