ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక షాకింగ్ వీడియో వైరల్( Viral Video ) అవుతోంది.ఒక టీచర్ 11 ఏళ్ల విద్యార్థిని( Student ) కాలర్ పట్టుకుని కిందకు తోసేసిన దృశ్యాలు అందులో ఉన్నాయి.
ఈ ఘటన 2024, డిసెంబర్ 6న అమెరికాలోని జార్జియా రాష్ట్రంలోని( Georgia ) డెరెన్నే మిడిల్ స్కూల్‌లో జరిగింది.తాజాగానే వీడియో వెలుగులోకి వచ్చింది.
రిపోర్ట్స్ ప్రకారం, ఆ టీచర్ విద్యార్థి తల్లి గురించి అనుచిత వ్యాఖ్యలు చేశాడట, అందుకే ఆ విద్యార్థి టీచర్‌ను( Teacher ) నిలదీశాడు.ఇదే వారి మధ్య గొడవకు కారణం.“జార్జియాకు చెందిన ఆరో తరగతి విద్యార్థిని క్లాస్‌రూమ్‌లోనే టీచర్ నెలపైకి తోసేసాడు.” అని న్యూయార్క్ పోస్ట్ ఈ వీడియోను షేర్ చేస్తూ రాసింది.
విద్యార్థి తల్లి చె’నెల్ రస్సెల్( Che’Nelle Russell ) ఈ సంఘటనపై స్పందించారు.తన కుమారుడు టీజే ( TJ ) తన గురించి టీచర్ చేసిన అనుచిత వ్యాఖ్యల వల్లే కలత చెందాడని ఆమె చెప్పారు.“నా గురించి ఆయన అనుచితంగా మాట్లాడినట్లు నాకు చెప్పారు, అది నా కొడుక్కి నచ్చలేదు.” అని ఆమె డబ్ల్యూటీఓసీతో అన్నారు.ఈ ఘటనలో టీజేకి గాయాలయ్యాయి, ఒళ్లంతా దెబ్బలు తగిలాయి.ఈ ఘటన తర్వాత అతన్ని ఎమర్జెన్సీ రూమ్‌కు తీసుకెళ్లారు.సవన్నా మార్నింగ్ న్యూస్ ప్రకారం, ఈ ఘటన జరిగిన కొద్దిసేపటికే ఆ టీచర్ తన ఉద్యోగానికి రాజీనామా చేశాడు, కానీ ఇప్పటివరకు ఎలాంటి క్రిమినల్ కేసులు లేదా దావాలు నమోదు కాలేదు.
రస్సెల్ న్యాయం కావాలని డిమాండ్ చేస్తున్నారు.టీచర్ మరింత తీవ్రమైన పరిణామాలను ఎదుర్కోవాలని ఆమె నమ్ముతున్నారు.“అతను జైలుకు వెళ్లాలి.అతను నా కొడుకుని బాధపెట్టాడు.ఇది చాలా బాధాకరం, అతని తండ్రి, నేను కూడా టీజేని అలా ఎప్పుడూ చేయి చేసుకోలేదు.” అని ఆమె అన్నారు.
ఈ వీడియో ఆన్‌లైన్‌లో తీవ్ర చర్చకు దారితీసింది.
చాలామంది టీచర్ చర్యలను ఖండిస్తూ, అవి ఆమోదయోగ్యం కావని అన్నారు.మరికొందరు విద్యార్థి అమర్యాదగా ప్రవర్తించాడని నిందించారు.“విద్యార్థులను హింసించే ఉపాధ్యాయులు తమ ఉద్యోగాలను కోల్పోవడమే కాకుండా జైలుకు కూడా వెళ్లాలి” అని ఒక కామెంట్ రాశారు.“తల్లిదండ్రులు తమ పిల్లలను క్రమశిక్షణలో పెట్టకపోతే, ఉపాధ్యాయులు పెడతారు” అని మరొకరు రాశారు.ఈ ఘటన ప్రజలను ఆగ్రహానికి గురిచేసింది.వైరల్ వీడియోపై మీరు కూడా ఒక లుక్కేయండి.