ఐకాన్ స్టార్ అల్లు అర్జున్( Allu Arjun ) సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో భాగంగా రేవతి అనే అభిమాని మృతి చెందడంతో ఈయనే పరోక్షంగా కారణమని పోలీసులు తనని అరెస్టు చేసిన విషయం మనకు తెలిసిందే.కొన్ని గంటల వ్యవధిలోనే అల్లు అర్జున్ అరెస్టు కావడం పోలీస్ స్టేషన్ కి వెళ్లి అటు నుంచి వైద్య చికిత్సల నిమిత్తం గాంధీ ఆసుపత్రికి వెళ్లడం, తర్వాత కోర్టులో హాజరు పరచడం కోర్ట్ రిమాండ్ విధిస్తే చంచల్ కూడా జైలుకు వెళ్లడం జరిగింది.
ఇక ఈయన జైలులోకి అడుగుపెట్టిన కొన్ని నిమిషాలకే బెయిల్ కూడా రావడంతో అల్లు అర్జున్ విడుదల అయ్యారు.

ఈ విధంగా అల్లు అర్జున్ అరెస్ట్( Arrest ) అనేది రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా సంచలనగా మారింది.కేవలం సినీ ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా రాజకీయాల పరంగా కూడా పెద్ద ఎత్తున చర్చలకు కారణమైంది.ఇక అల్లు అర్జున్ ఇంటికి రావడంతో పెద్ద ఎత్తున సినిమా సెలబ్రిటీలందరూ కూడా అల్లు అర్జున్ ఇంటికి వెళ్లి అల్లు అర్జున్ ని పరామర్శిస్తూ ఆయనకు మద్దతు తెలియజేశారు.
ఇక ఏపీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అలాగే ప్రభాస్ వంటి వారు కూడా ఫోన్లో అల్లు అర్జున్ పరామర్శించారు.

ఈ క్రమంలోనే మంచు మనోజ్ ( Manchu Manoj ) సైతం ఎక్స్ వేదికగా అల్లు అర్జున్ అరెస్టు గురించి స్పందిస్తూ చేస్తున్న పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.మొత్తం దిష్టికి పోయింది బాబాయ్ వెల్కమ్ బ్యాక్ టు అల్లు అర్జున్ గారు.ఇలాంటి క్లిష్ట పరిస్థితులలో మీరు చూపించిన ప్రశాంతత, బాధ్యతయుత వ్యవహారశైలిని మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నా.
బాధిత కుటుంబానికి మద్దతుగా నిలుస్తానని మీరు ఇచ్చిన హామీ మీ నిజమైన వ్యక్తిత్వాన్ని తెలియజేస్తోంది.సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటన నిజంగానే బాధాకరం అయితే భద్రతకు ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వాలి.
పక్కవారి పట్ల ఎలా అప్రమత్తంగా ఉండాలి అనే విషయాలను మరోసారి ఈ ఘటన గుర్తు చేస్తోంది.మీ కుటుంబానికి మరింత శాంతి సంతోషాలను కలగజేయాలని ఆకాంక్షిస్తున్నాను అంటూ అల్లు అర్జున్ అరెస్టుపై మంచు మనోజ్ చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.