ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ( Allu Arjun ) అరెస్టుపై సినీ ఇండస్ట్రీ మొత్తం స్పందిస్తూ వారి అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.ఈ క్రమంలోనే సింగర్ కల్పనా ( Sjnger Kalpana ) రాఘవేంద్ర సైతం అల్లు అర్జున్ అరెస్టును తీవ్రస్థాయిలో ఖండించారు.
సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో శనివారం ఆమె మాట్లాడారు.అల్లు అర్జున్ అనే వ్యక్తి కేవలం రెండు తెలుగు రాష్ట్రాలలో మాత్రమే కాదు దేశవ్యాప్తంగా ఐకానిక్ స్టార్ అలాంటి ఒక గొప్ప వ్యక్తిని పోలీసులు బెడ్ రూమ్ లోకి వెళ్లి అరెస్టు చేయడం బాధాకరమని తెలిపారు.
సినిమా పెట్టుబడి వ్యాపారమని, లాభాల కోసమే సినిమా తీస్తారని, డబ్బుల కోసమే నటిస్తారంటూ సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలను కూడా ఈమె తప్పు పట్టారు.
పుష్ప 2 సినిమా దేశవ్యాప్తంగా సుమారు 1000 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది.అయితే అందులో 18 శాతం జీఎస్‌టీ ప్రభుత్వానికి చేరుతుందని సీఎంకు తెలియదా అని ఆమె ప్రశ్నించారు.సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాటలో భాగంగా ఆ మహిళా మృతి వెనుక కూడా ఏదైనా కుట్రకోణం దాగి ఉందేమో ఆ విషయం గురించి కూడా విచారణ చేపట్టాలనీ ఈమె ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు.
ఇలా అల్లు అర్జున్ అరెస్టు విషయంలో రేవంత్ రెడ్డి ( Revanth Reddy )మాట్లాడుతున్న తీరు పలువురికి సందేహాలను కూడా కలిగిస్తుంది.ఉద్దేశం పూర్వకంగానే అల్లు అర్జున్ ని అరెస్ట్ చేశారని స్పష్టమవుతుంది.ఇలా తొక్కిసలాటలో ఇప్పటికే ఎంతోమంది రాజకీయ నాయకుల బహిరంగ సభలలోనే మరణించారు.అలాంటప్పుడు రాజకీయ నాయకులు ఎవరిని కూడా ఇప్పటివరకు అరెస్టు చేయలేదు కదా అంటూ మరికొందరు అల్లు అర్జున్ అరెస్టును తీవ్రంగా తప్పుపడుతున్నారు.
ఏది ఏమైనా అల్లు అర్జున్ అరెస్టు వ్యవహారం సినీ పరిశ్రమలో కంటే కూడా రెండు తెలుగు రాష్ట్ర రాజకీయాలలో పెద్ద ఎత్తున చర్చలకు కారణమైంది.