ఈ సింపుల్ రెమెడీతో చెప్పండి హెయిర్ బ్రేకేజ్ కు బై బై..!

హెయిర్ ఫాల్ మాదిరి గానే  హెయిర్ బ్రేకేజ్( Hair Breakage ) సమస్య కూడా చాలా మందిని కలవర పెడుతుంటుంది.పోషకాల కొరత, ఒత్తిడి, వేడి వేడి నీటితో స్నానం చేయడం, హెయిర్ స్టైలింగ్ టూల్స్ ను అధికంగా వినియోగించడం తదితర కారణాల వల్ల జుట్టు మధ్యలోకి ముక్కలై పోతుంటుంది.

 Say Goodbye To Hair Breakage With This Simple Remedy Details, Hair Breakage, Sim-TeluguStop.com

ఈ సమస్యను ఎలా పరిష్కరించుకోవాలో తెలియక తెగ మదన పడిపోతూ ఉంటారు.మీరు ఈ జాబితాలో ఉన్నారా.? అయితే చింతించకండి.ఇప్పుడు చెప్పబోయే సింపుల్ రెమెడీతో హెయిర్ బ్రేకేజ్ సమస్యకు బై బై చెప్పండి.

అందుకోసం ముందుగా ఒక కలబంద ఆకును( Aloevera Leaf ) తీసుకుని వాటర్ తో శుభ్రంగా క‌డిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో కట్ చేసుకున్న కలబంద ముక్కలు, నాలుగు మందారం పువ్వులు,( Hibiscus Leaves ) మూడు టేబుల్ స్పూన్లు పెరుగు మరియు వన్ టేబుల్ స్పూన్ విటమిన్ ఈ ఆయిల్ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.

Telugu Aloevera Leaf, Curd, Breakage, Care, Care Tips, Fall, Pack, Healthy, Hibi

గంట అనంతరం మైల్డ్ షాంపూ ను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.వారానికి ఒకసారి ఈ రెమెడీని పాటించడం వల్ల జుట్టు కుదుళ్లకు చక్కని పోషణ అందుతుంది.హెయిర్ మూలాల నుంచి బలోపేతం అవుతుంది.

జుట్టు రాలడం, విరగడం వంటి సమస్యలు త‌గ్గు ముఖం పడతాయి.డ్రై హెయిర్ సమస్య ఉన్నా కూడా దూరం అవుతుంది.

Telugu Aloevera Leaf, Curd, Breakage, Care, Care Tips, Fall, Pack, Healthy, Hibi

ఇక ఈ రెమెడీని పాటించడంతోపాటు రెగ్యులర్ గా తలస్నానం చేసే అలవాటు ఉంటే మానుకోండి.వేడి వేడి నీటితో కాకుండా గోరువెచ్చని నీటితో హెయిర్ వాష్ చేసుకోండి.రసాయనాలతో నిండి ఉన్న షాంపూలను అవాయిడ్ చేయండి.హెయిర్ స్టైలింగ్ టూల్స్ ను వాడడం తగ్గించండి.కంటి నిండా నిద్ర ఉండేలా చూసుకోండి.ఒత్తిడికి దూరంగా ఉండండి.

అలాగే ఆహారంలో తాజా పండ్లు, కూరగాయలు, న‌ట్స్‌, గుమ్మ‌డి గింజ‌లు, మొలకెత్తిన విత్తనాలు, గుడ్లు, పాలు, పెరుగు వంటి ఆహారాలను చేర్చుకోండి.ఇవి జుట్టు ఆరోగ్యానికి, దృఢత్వానికి అవసరమయ్యే పోషణ అందిస్తాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube