మీకు ఇదేం సరదా రా బాబు.. కాస్త అటు ఇటు అయితే ప్రాణాలు గాల్లోకె..

సోషల్ మీడియా వాడకం ఎక్కువ అవుతున్న కొద్ది వారి జీవితంలో సగం సమయాన్ని సోషల్ మీడియాకు కేటాయిస్తూనే ఉన్నారు.మరి కొందరైతే సోషల్ మీడియాలో పాపులర్ కావడానికి చెయ్యరాని పనులు చేస్తూ కొందరు ఇబ్బందులకు గురవుతున్నారు.

 Bihar Boy Lay Down On The Railway Track Video Viral Details, Train, Travel, Vira-TeluguStop.com

ముఖ్యంగా యువత సోషల్ మీడియాలో వైరల్ కావాలన్న ఉద్దేశంతో రకరకాల డేంజర్ పనులు చేస్తూ చివరకు ప్రాణాలు కోల్పోవడం కూడా చూస్తూనే ఉన్నాము.ముఖ్యంగా వాహనాలు నడుపుతున్న సమయంలో చేసే డేంజరస్ పనుల ద్వారా చాలామంది ఇబ్బందులు పడినవారు, అలాగే ప్రాణాలు కోల్పోయిన వారు కూడా మనం చూసాము.

ఇకపోతే తాజాగా ఓ యువకుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యేందుకు ట్రైన్( Train ) కింద పడుకొని లేచిన సంఘటన ఇప్పుడు వైరల్ గా మారింది.ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు చూస్తే.వైరల్ గా మారిన వీడియోని( Viral Video ) గమనించినట్లయితే.ఈ వీడియో బీహార్ రాష్ట్రంలో( Bihar ) చిత్రీకరించినట్లుగా అర్థమవుతుంది.వీడియోను చిత్రీకరించిన విధానాన్ని బట్టి చూస్తే ఇద్దరు కుర్రాళ్ళు రైలు పట్టాల దగ్గరకు వచ్చారు.అయితే రైలు వస్తున్న సమయంలో రైలును గమనించిన ఓ యువకుడు నేరుగా పట్టాల మీదకు వెళ్లి నిలువుగా పడుకున్నాడు.

అలా అతడు పడుకున్న తర్వాత రైలు అతడు మీద నుంచి చాలా స్పీడ్ గా వెళ్తుంది.ఈ సంఘటన మొత్తం మరో యువకుడు పక్కనే నిలబడి వీడియో తీశాడు.ఆ రైలు కుర్రాడు మీద నుంచి వెళ్లిపోయిన తర్వాత కుర్రాడు పైకి లేచి బయటకి వచ్చేసాడు.దాంతో అతడు ఏదో ఒక విజయం సాధించినట్లుగా ఫీలింగ్స్ ఇస్తాడు.

ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వారు అవుతుంది.ఇప్పటిదాకా ఈ వీడియోను ఒక మిలియన్ వ్యూస్ పైగా సాధించగా.

వేల సంఖ్యలో కామెంట్స్ చేస్తున్నారు.ఇక ఈ వీడియోని చూసిన సోషల్ మీడియా వినియోగదారులు రకరకాలుగా స్పందిస్తున్నారు.

వీడికి ఏమైనా పరలోకానికి వెళ్లడానికి అంత ఇష్టంగా ఉందా అంటూ కామెంట్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube