ప్రస్తుతం స్టార్ డైరెక్టర్లందరు వాళ్ళకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్నారు.అయితే డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ గా గుర్తింపును సంపాదించుకున్న పూరి జగన్నాధ్( Director Puri Jagannadh ) మాత్రం వరుస డిజాస్టర్లను మూట గట్టుకుంటూ ముందుకు సాగడం అనేది ఇప్పుడు అందరిలో కలవరాన్ని రేపుతుంది.
మరి ఏది ఏమైనా కూడా వరుస సక్సెస్ లను సాధించాల్సిన అవసరమైతే ఉంది.ఇక తన కొడుకు అయిన ఆకాష్ పూరిని( Akash Puri ) సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేస్తూ పూరి జగన్నాథ్ ‘మెహబూబా’( Mehbooba Movie ) అనే సినిమా చేశాడు.

అయితే ఈ సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించలేదు.దాంతో ఆకాశ్ పూరి అడపాదడపా సినిమాలు చేసుకుంటూ వస్తున్నప్పటికి ఆయనకు రావాల్సిన క్రేజ్ అయితే రావడం లేదు.మరి ఇలాంటి సందర్భంలో ఎవరో హీరోని పెట్టి సినిమాలు తీసే కంటే పూరి జగన్నాధ్ తన కొడుకుని హీరోగా పెట్టి సినిమాలు చేస్తే బాగుంటుంది కదా ఆయనకి కూడా అంతో ఇంతో మార్కెట్ ఏర్పడుతుంది కదా అని కొంతమంది వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.

ఇక పూరి కొడుకు తన నాన్న సపోర్టు లేకుండా ఎదగాలనే ప్రయత్నం చేస్తున్నప్పటికి తను ఏ ప్రయత్నం చేసిన కూడా కలిసి రావడం లేదు.మరి ఇప్పటికైన వీళ్ళిద్దరూ కలిసి సినిమా చేసి మంచి విజయాన్ని సాధిస్తే ఆయన డైరెక్టర్ గా, ఈయన హీరోగా వాళ్ళను వాళ్ళు ప్రూవ్ చేసుకున్నవారవుతారు.మరి వాళ్ళు ఇదే రీతిలో ముందుకు సాగుతారా లేదా అనేది తెలియాల్సి ఉంది.
మరి పూరి జగన్నాధ్ ఎందుకు తన కొడుకును నెగ్లెక్ట్ చేస్తున్నాడు అనే ధోరణిలో కూడా కొన్ని ప్రశ్నలైతే తలెత్తుతున్నాయి.మరి ఇప్పటికైనా వీళ్ళ కాంబినేషన్ లో ఒక భారీ సినిమా వస్తుందా రాదా అనేది తెలియాల్సి ఉంది.