కెనడాలో ముగ్గురు భారతీయ విద్యార్ధుల హత్య .. రంగంలోకి విదేశాంగ శాఖ

కెనడాలో( Canada ) రోజుల వ్యవధిలో ముగ్గురు భారతీయ విద్యార్ధులు ప్రాణాలు కోల్పోవడంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది.ఈ మేరకు కెనడాలోని భారతీయ మిషన్‌లు, ఇండియన్ కమ్యూనిటీతో కేంద్ర విదేశాంగ శాఖ టచ్‌లోకి వెళ్లింది.

 Three Indian Students Killed In Canada, Mea Takes Up Issue , Canada , Mea , Th-TeluguStop.com

ఈ మేరకు ఎంఈఏ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ.కెనడాలో చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలలో ముగ్గురు భారతీయ విద్యార్ధులు ప్రాణాలు కోల్పోయారని తెలిపారు.

ఈ విషాదాలపై తాము తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నామని.మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్లుగా జైస్వాల్ పేర్కొన్నారు.

ఒట్టావాలోని ఇండియన్ హైకమీషనర్, టొరంటోలోని కాన్సులేట్లు బాధిత కుటుంబాలతో టచ్‌లో ఉన్నట్లు ఆయన వెల్లడించారు.

ఈ ఘటనలపై సమగ్ర విచారణ కోసం స్థానిక అధికారులపై ఒత్తిడి తీసుకొస్తున్నామని రణధీర్ జైస్వాల్( Randhir Jaiswal ) తెలిపారు.

కెనడా సహా ఇతర ప్రాంతాల్లో ఉన్న భారతీయ పౌరుల భద్రత, సంక్షేమమే భారత ప్రభుత్వానికి ముఖ్యమన్నారు.ఒట్టావాలోని భారత హైకమీషన్, కాన్సులేట్లు ( Indian High Commission and Consulates in Ottawa )వారి సంక్షేమం, భద్రత కోసం నిరంతరం స్థానిక అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నాయని జైస్వాల్ చెప్పారు.

Telugu Canada, Indian, Mea, Randhir Jaiswal, Indian Canada-Telugu Top Posts

విద్వేషపూరిత నేరాలు, హింస కారణంగా కెనడాలో భద్రతా ప్రమాణాలు దిగజారిపోతున్నాయని .ఈ కారణం చేత భారతీయులు అప్రమత్తంగా ఉండాలని అడ్వైజరీని కూడా జారీ చేసినట్లు ఆయన వెల్లడించారు.ఏ దేశంలోనూ లేనంత స్థాయిలో భారతీయ విద్యార్ధులు కెనడాలో చదువుకుంటున్నారని , ఇండియన్ కమ్యూనిటీ కూడా అక్కడ చాలా పెద్ద సమూహమని జైస్వాల్ తెలిపారు.అధికారిక సమాచారం ప్రకారం.కెనడాలో 4.5 లక్షల మంది భారతీయ విద్యార్ధులు చదువుతున్నారని అంచనా .

Telugu Canada, Indian, Mea, Randhir Jaiswal, Indian Canada-Telugu Top Posts

కాగా.ఈ నెల ప్రారంభంలో పంజాబ్‌కు చెందిన గురాసిస్ సింగ్( Gurassis Singh ) తన రూమ్ మెట్‌ చేతిలోనే హత్యకు గురయ్యాడు.ఆ తర్వాత డిసెంబర్ 6న సెక్యూరిటీ గార్డ్‌గా పనిచేస్తోన్న హర్షదీప్ సింగ్‌ను ఓ ముఠా దారుణంగా కాల్చి చంపింది.ఆ తర్వాతి రోజే పంజాబ్‌కే చెందిన రితిక్ రాజ్‌పుత్‌పై చెట్టు కూలిపోవడంతో ఆయన ప్రాణాలు కోల్పోయారు.

వరుస ఘటనలతో కెనడాలోని భారతీయ కమ్యూనిటీ బిక్కుబిక్కుమంటూ గడుపుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube