సినిమా ఇండస్ట్రీలో ఇప్పటికే చాలామంది హీరోలు వారి కూతుర్లు కొడుకులను సినిమా ఇండస్ట్రీకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే.అలా సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం చాలామంది రెండు తరాల వారు వరుసగా సినిమాలు చేస్తూ బిజీ బిజీగా ఉన్నారు.
చిరంజీవి తన కొడుకు రామ్ చరణ్ ( Ram Charan )ని తీసుకువచ్చిన విషయం తెలిసిందే.నాగార్జున తన కొడుకులు అఖిల్ నాగచైతన్యలను తీసుకువచ్చారు.
అయితే తెలుగు హీరోలు చాలామంది తమ కొడుకుల్ని హీరోలుగా పరిచయం చేస్తారు.కానీ వారి కూతుళ్లని హీరోయిన్లని చేయడానికి మాత్రం చాలామంది ఇష్టపడరు.

మిగతా విభాగాల్లో పనిచేసే విషయమై కూడా పెద్దగా ప్రోత్సహించరు.కానీ రవితేజ ( Ravi Teja )మాత్రం అలా కాదని నిరూపిస్తున్నాడు.ఎందుకంటే ఇతడి కూతురు దర్శకత్వం నేర్చుకుంటోందట.ఎలాంటి సినిమా బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి టాలీవుడ్ లో స్టార్ హీరో అయ్యాడు మన మాస్ మహారాజా రవితేజ.
ఇతడికి కొడుకు మహాధన్, కూతురు మోక్షద( Mokshada ) ఉన్నారు.కొడుకు ఇదివరకే రాజా ది గ్రేట్ మూవీలో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేశాడు.ప్రస్తుతం ఒక దర్శకుడి దగ్గర సహాయకుడిగా పనిచేస్తున్నట్లు తెలుస్తోంది.రవితేజ కూతురు కూడా ఇప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేస్తోందట.

ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్‌మెంట్స్( Sitara Entertainments ) తీస్తున్న ఒక సినిమాకు రవితేజ కూతురు మోక్షద, అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తుందట.గతంలో రవితేజ కూడా ఇలానే సహాయ దర్శకుడిగా కెరీర్ మొదలు పెట్టాడు.తర్వాత నటుడు అయ్యాడు.బహుశా మోక్షద కూడా ఇలా మొదట దర్శకత్వంలో మెలకువలు నేర్చుకుని, నటి అవుతుందేమో చూడాలి మరి.ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో మాస్ మహారాజా అభిమానులు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.ఆయన తీసుకున్న నిర్ణయానికి మద్దతుగా కామెంట్స్ చేస్తున్నారు.