సినిమాలు, కచేరీలు లేదా నాటక ప్రదర్శనలు వంటి ఈవెంట్స్‌కు హాజరైనప్పుడు చాలా మందికి ఒక సాధారణ సమస్య ఎదురవుతుంది, అదే ప్రదర్శన మధ్యలో బాత్రూమ్‌కు( Bathroom ) వెళ్లవలసి రావడం.చాలా మంది ఈవెంట్‌ను మిస్ అవ్వకూడదని ఆపుకోవడానికి ప్రయత్నిస్తారు, కానీ చివరికి ప్రకృతి పిలుపుకి తలొంచక తప్పదు.
ఇప్పుడు ఒక సంస్థ ఈ సమస్యకు పరిష్కారం కనుగొన్నట్లు ప్రకటించింది.
లిక్విడ్ డెత్, డిపెండ్ కలిసి “పిట్ డైపర్”( Pit Diaper ) అనే ఒక ప్రత్యేకమైన అడల్ట్ డైపర్‌ను విడుదల చేశాయి.
కచేరీలు లేదా కార్యక్రమాలకు హాజరయ్యే, బాత్రూమ్ బ్రేక్ కోసం తమ సీట్లు వదలకూడదనుకునే వ్యక్తుల కోసం ఈ డైపర్లు ప్రత్యేకంగా తయారు చేశారు.డైలీ స్టార్ న్యూస్ నివేదిక ప్రకారం, ఈ డైపర్లు వాడుతున్నప్పుడు ఎవరికీ తెలియకుండా మూత్రం( Urine ) పోసుకోవచ్చు.
ముఖ్యంగా ఏదైనా కార్యక్రమం జరుగుతున్నప్పుడు ఆటంకం కలగకుండా ఉండాలంటే ఇవి చాలా ఉపయోగపడతాయి.లీక్ కాకుండా, మూత్రపు వాసన రాకుండా ఉండేలా వీటిని తయారుచేశారు.దీనివల్ల వాడుతున్నవారికి సౌకర్యంగా, పరిశుభ్రంగా ఉంటుంది.
అయితే, ఈ డైపర్ల ధర ఒక్కొక్కటి రూ.6,000 కావడం విశేషం.వీటిని తయారుచేసిన కంపెనీ, ఈవెంట్లకు వెళ్ళేవాళ్ళకి ఇదొక స్టైలిష్ ఆప్షన్ అని చెప్తోంది.
అభిమానులు తమకిష్టమైన కార్యక్రమాల్ని ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడొచ్చని ప్రచారం చేస్తోంది.పిట్ డైపర్లు ప్రస్తుతం లిక్విడ్ డెత్( Liquid Death ) అఫీషియల్ వెబ్‌సైట్‌లో మాత్రమే అందుబాటులో ఉన్నాయి.
మొదటి విడత అమ్మకాలు ఒక్క రోజులోనే అయిపోయాయి, మళ్లీ ఎప్పుడు అందుబాటులోకి వస్తాయో తెలియదు.
కంపెనీ ఈ డైపర్లకి సంబంధించిన ప్రమోషనల్ వీడియోలు, ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది.దీనికి నెటిజన్ల నుంచి భిన్న స్పందనలు వచ్చాయి.కొందరు ఈ ఆలోచన బాగుందని, రోజూ వాడొచ్చని అన్నారు.
మరికొందరు మాత్రం దీన్ని విమర్శిస్తూ, కచేరీ జరిగే చోట చెడు వాసన వస్తుందని జోకులు వేశారు.అభిప్రాయాలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, ఈ ఉత్పత్తి మార్కెట్‌లో మాత్రం మంచి గుర్తింపు పొందింది.