పుష్ప ది రూల్ మూవీ( Pushpa the rule movie ) బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి మంచి లాభాలను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.ఇప్పటికే ఈ సినిమా విడుదలై 8 రోజులైంది.
ఈ సినిమాకు ఏకంగా 450 కోట్ల రూపాయల రేంజ్ లో కలెక్షన్లు వచ్చాయని సమాచారం అందుతోంది.నైజాంలో ఈ సినిమాకు ఇప్పటికే 65 కోట్ల రూపాయల( 65 crore rupees ) షేర్ కలెక్షన్లు రాగా సీడెడ్ లో 25 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లు వచ్చాయి.
తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా ఏకంగా 145 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను సొంతం చేసుకోవడం గమనార్హం.8 రోజుల్లో ఈ స్థాయిలో కలెక్షన్లు సొంతం కావడం అంటే మామూలు విషయం కాదు.కేరళ రాష్ట్రంలో మాత్రం ఈ సినిమాకు ఆశించిన స్థాయిలో కలెక్షన్లు రావడం లేదు.ఈ తరహా కథాంశాలు అక్కడి ప్రేక్షకులకు నచ్చే కథాంశాలు కాకపోవడం గమనార్హం.

మరోవైపు అల్లు అర్జున్( Allu Arjun ) కేసు విషయంలో షాకింగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది.బన్నీ జైలుకు వెళ్తారా లేక బెయిల్ పై రిలీజ్ అవుతారా అనే కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.అల్లు అర్జున్ కు రిమాండ్ విధించగా 14 రోజుల పాటు రిమాండ్ కొనసాగనుంది.బన్నీ అరెస్ట్ విషయంలో ఏదో కుట్ర జరిగిందనే అభిప్రాయాలు బలంగా వినిపిస్తున్నాయి.సోమవారం వరకు బన్నీ జైలుకే పరిమితం కానున్నారు.

ఈ కేసు విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఏం జరుగుతుంది.అల్లు అర్జున్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టించాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.అల్లు అర్జున్ కెరీర్ కు ఈ అరెస్ట్ ఒక బ్రేక్ లాంటిదని కామెంట్లు వినిపిస్తున్నాయి.
అల్లు అర్జున్ ఇతర హీరోలకు భిన్నంగా అడుగులు వేయడం ద్వారా ప్రశంసలు అందుకుంటున్నారు.బన్నీ క్రేజ్ మాత్రం మామూలుగా లేదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.