శ్రీదేవిఅతిలోక సుందరిగా పేరు పొందిన నటీమణి.ఎన్నో అద్భుత సినిమాలు చేసింది.
తెలుగు, తమిళం, కన్నడ, హిందీ ఒకటేమిటీ అన్ని సినిమా పరిశ్రమలను ఓ ఊపు ఊపింది.పలు చిత్ర పరిశ్రమల్లో అగ్ర నటులు అందరితోనూ కలిసి నటించింది.
హీరోయిన్ గా ఎవరూ అందుకోలేని స్థాయిని అందుకుంది.ప్రమాదవశాత్తు 2018లో దుబాయ్ లో కన్నుమూసింది.
లక్షలాది మంది అభిమానులను శోకసంద్రంలో ముంచి వెళ్లింది.అయితే చిన్నప్పటి నుంచి తన తల్లిదండ్రులంటే శ్రీదేవికి ఎంతో అభిమానం, ప్రేమ.
శ్రీదేవి తన నాలుగో ఏటనే సినిమా రంగంలోకి అడుగు పెట్టింది.బాల నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది.ఆ తర్వాత హీరోయిన్ గా ఎదిగి ఉత్తర, దక్షిణం అని తేడా లేకుండా అగ్రతారగా ఎదిగింది.సినిమాలతో ఫుల్ బిజీ అయినా తన తల్లిదండ్రులను అనుక్షణం అంటిపెట్టుకొనే ఉన్నది.
ఫేరెంట్స్ తల్లితండ్రులు రాజేశ్వరి, అయ్యప్పన్ తో ఆమెకు అనుబంధం చాలా ఎక్కువ.తల్లిదండ్రులు శ్రీదేవిని సిస్టమాటిక్ గా పెంచుతూనే ప్రేమను పంచేవారు.
షూటింగ్ కు వెళ్లే సమయంలో తల్లిదండ్రులతో ఒక్కసారి అయినా మాట్లాడేది శ్రీదేవి.లేదంటే తనకు ఏదీ తోచేది కాదని చెప్పింది.
వారిని వదిలి దూర ప్రాంతాలకు షూటింగ్ కు వెళ్లినప్పుడు కూడా తప్పకుండా రోజూ తల్లిదండ్రులకు ఫోన్ చేసేదట.
ప్రతి రోజు తల్లిదండ్రుల నుంచి ఫోన్లు వచ్చేవి.కానీ ఓ రోజు తనకు కాల్ రాలేదు.మరుసటి రోజు తన తల్లి ఫోన్ చేసింది.
నాన్నకు ఆరోగ్యం బాగాలేదు అని చెప్పింది.కాన .అంతకు ముందు రోజే తన తండ్రి చనిపోయాడు.ఆ విషయం తనకు తెలియనివ్వలేదు.
ఈ ఘటన నుంచి బయట పడేందుకు శ్రీదేవికి చాలా కాలం పట్టింది.
తండ్రి చనిపోయిన బాధ నుంచి కోలుకునే సమయంలోనే తల్లికూడా చనిపోయింది.తన తల్లికి దగ్గరుండి అంత్యక్రియలు చేసింది.తన జీవితంలో అత్యంత బాధాకర సంఘటనలు తన తల్లిదండ్రుల మరణం అనేది శ్రీదేవి.
నిజానికి తను కూడా సడెన్ గానే చనిపోయి.అందరినీ షాక్ కు గురి చేసింది.