ఈ హెయిర్ ఆయిల్‌ను వాడితే చుండ్రు నుంచి జుట్టు రాల‌డం వ‌ర‌కు అన్నీ ప‌రార్‌!

అందాన్ని ప్రభావితం చేసే వాటిలో జుట్టు ఒకటి.జుట్టు ఎంత ఒత్తుగా మ‌రియు పొడుగ్గా ఉంటే అందం అంత రెట్టింపు అవుతుందని భావిస్తారు.

 There Are Many Benefits Of Using This Hair Oil! Hair Oil, Homemade Hair Oil, Lat-TeluguStop.com

అది నిజం కూడా.ఈ క్రమంలోని ఒత్తైన, పొడ‌వాటి జుట్టు కోసం చాలా మంది మార్కెట్లో లభ్యమయ్యే ఖరీదైన హెయిర్ ఆయిల్స్‌ను కొనుగోలు చేసి వాడుతుంటారు.

అయితే వాటి వల్ల ఎంతో ఉపయోగం ఉంటుందో తెలియదు కానీ.ఇప్పుడు చెప్పబోయే హోమ్ మేడ్ హెయిర్ ఆయిల్ వాడితే కనుక చుండ్రు నుంచి జుట్టు రాల‌టం వరకు ఎన్నో సమస్యలు ప‌రార్ అవుతాయి.

మరి ఇంకెందుకు ఆలస్యం ఆ హెయిర్ ఆయిల్ ను ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.

ముందుగా స్టవ్ ఆన్ చేసి మందపాటి గిన్నె పెట్టుకుని అందులో ఒక గ్లాస్ ఆలివ్ ఆయిల్ ను పోసుకోవాలి.

ఆయిల్ కాస్త హీట్ అవ్వగానే అందులో రెండు టేబుల్ స్పూన్లు ఎండిన ఉసిరి కాయ ముక్కలు, పది ఎండిన కరివేపాకు ఆకులు, పది ఎండిన వేపాకు, వన్ టేబుల్ స్పూన్ మెంతులు, వన్ టేబుల్ స్పూన్ ములేటి పౌడర్ వేసుకొని స్లో ఫ్లేమ్ ఫై ప‌ది నుంచి ప‌దిహేను నిమిషాల పాటు ఉడికించాలి.

Telugu Care, Care Tips, Oil, Homemade Oil, Latest, Long, Thick-Telugu Health Tip

అనంతరం స్టవ్ ఆఫ్ చేసి ఆయిల్ ను చల్లార బెట్టుకోవాలి.పూర్తిగా కూల్ అయిన‌ అనంతరం పల్చటి వస్త్రం సహాయంతో ఆయిల్ ను సపరేట్ చేసుకోవాలి.ఈ ఆయిల్ ఒక బాటిల్ లో నింపుకుని స్టోర్ చేసుకోవాలి.

వారంలో రెండు సార్లు ఈ ఆయిల్ ను రాత్రి నిద్రించే ముందు తలకు పట్టించాలి.మరుసటి రోజు ఉదయాన్నే తలస్నానం చేయాలి.

ఈ హెయిర్ ఆయిల్ ను వాడటం వల్ల చుండ్రు తగు ముఖం పడుతుంది.జుట్టు రాలడం క్రమంగా అదుపులోకి వస్తుంది.

కురులు ఒత్తుగా, పొడుగ్గా పెరుగుతాయి.జుట్టు విరగడం, పొట్టి పోవడం వంటివి తగ్గుతాయి.

మరియు కురులు స్మూత్ అండ్ షైనీగా సైతం మెరుస్తాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube