వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.జనసేన కార్యకర్తలపై కేసులు పెట్టారు.
అందుకే సంఘీభావం తెలిపానన్నారు.పవన్ కల్యాణ్ పార్టీ వేరే కావచ్చు కానీ ప్రజాస్వామ్యం కోసం మద్ధతు ఇచ్చినట్లు చెప్పారు.
మీ దోపిడీ బయటపడుతుందని విశాఖలో పవన్ ను అడ్డుకున్నారా అని ప్రశ్నించారు.తమపై కేసులు పెట్టడంపై పెట్టే శ్రద్ధ రైతులను ఆదుకోవడంపై పెట్టాలని సూచించారు.
రైతును చెప్పుతో కొట్టి జైల్లో పెట్టిన ప్రభుత్వమని విమర్శించారు.టీడీపీ కార్యాలయంపై దాడి జరిగి సంవత్సరం గడిచినా ఎటువంటి చర్యలు చేపట్టలేదని మండిపడ్డారు.
వైసీపీ తాటాకు చప్పుళ్లు, అక్రమ కేసులు, దాడులకు భయపడను అని పేర్కొన్నారు.తన జీవితంలో దాపరికం లేదు.
అన్ స్టాపబుల్ లో అన్నీ వివరించానని స్పష్టం చేశారు.ఎన్నికలు ఎప్పుడొచ్చినా వైసీపీని ప్రజలు భూస్థాపితం చేస్తారని ధీమా వ్యక్తం చేశారు.







