ఈ హెయిర్ ఆయిల్‌ను వాడితే చుండ్రు నుంచి జుట్టు రాలడం వరకు అన్నీ పరార్!
TeluguStop.com
అందాన్ని ప్రభావితం చేసే వాటిలో జుట్టు ఒకటి.జుట్టు ఎంత ఒత్తుగా మరియు పొడుగ్గా ఉంటే అందం అంత రెట్టింపు అవుతుందని భావిస్తారు.
అది నిజం కూడా.ఈ క్రమంలోని ఒత్తైన, పొడవాటి జుట్టు కోసం చాలా మంది మార్కెట్లో లభ్యమయ్యే ఖరీదైన హెయిర్ ఆయిల్స్‌ను కొనుగోలు చేసి వాడుతుంటారు.
అయితే వాటి వల్ల ఎంతో ఉపయోగం ఉంటుందో తెలియదు కానీ.ఇప్పుడు చెప్పబోయే హోమ్ మేడ్ హెయిర్ ఆయిల్ వాడితే కనుక చుండ్రు నుంచి జుట్టు రాలటం వరకు ఎన్నో సమస్యలు పరార్ అవుతాయి.
మరి ఇంకెందుకు ఆలస్యం ఆ హెయిర్ ఆయిల్ ను ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.
ముందుగా స్టవ్ ఆన్ చేసి మందపాటి గిన్నె పెట్టుకుని అందులో ఒక గ్లాస్ ఆలివ్ ఆయిల్ ను పోసుకోవాలి.
ఆయిల్ కాస్త హీట్ అవ్వగానే అందులో రెండు టేబుల్ స్పూన్లు ఎండిన ఉసిరి కాయ ముక్కలు, పది ఎండిన కరివేపాకు ఆకులు, పది ఎండిన వేపాకు, వన్ టేబుల్ స్పూన్ మెంతులు, వన్ టేబుల్ స్పూన్ ములేటి పౌడర్ వేసుకొని స్లో ఫ్లేమ్ ఫై పది నుంచి పదిహేను నిమిషాల పాటు ఉడికించాలి.
"""/"/
అనంతరం స్టవ్ ఆఫ్ చేసి ఆయిల్ ను చల్లార బెట్టుకోవాలి.పూర్తిగా కూల్ అయిన అనంతరం పల్చటి వస్త్రం సహాయంతో ఆయిల్ ను సపరేట్ చేసుకోవాలి.
ఈ ఆయిల్ ఒక బాటిల్ లో నింపుకుని స్టోర్ చేసుకోవాలి.వారంలో రెండు సార్లు ఈ ఆయిల్ ను రాత్రి నిద్రించే ముందు తలకు పట్టించాలి.
మరుసటి రోజు ఉదయాన్నే తలస్నానం చేయాలి.ఈ హెయిర్ ఆయిల్ ను వాడటం వల్ల చుండ్రు తగు ముఖం పడుతుంది.
జుట్టు రాలడం క్రమంగా అదుపులోకి వస్తుంది.కురులు ఒత్తుగా, పొడుగ్గా పెరుగుతాయి.
జుట్టు విరగడం, పొట్టి పోవడం వంటివి తగ్గుతాయి.మరియు కురులు స్మూత్ అండ్ షైనీగా సైతం మెరుస్తాయి.
నాగ వంశీది లక్కీ హ్యాండ్…. చిరు బ్లడ్ బ్యాంక్ పై సూర్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్!