ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్న వార్తల్లో త్రిష , విజయ్( Trisha , Vijay ) ల మధ్య ఏదో ఉంది అంటూ వినిపిస్తున్న వార్తలు కూడా ఒకటి.నిన్నటి రోజు నుంచి ఈ వార్తలు సోషల్ మీడియాలో( social media ) జోరుగా వినిపిస్తున్న విషయం తెలిసిందే.
దీంతో ఈ విషయాల్లో మరోసారి వార్తల్లో నిలిచారు దళపతి విజయ్.కోలీవుడ్ స్టార్ హీరోయిన్ త్రిషతో రిలేషన్ లో ఉన్నారు అంటూ గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి.
త్రిష తో రిలేషన్ లో ఉంటూ తన భార్య సంగీతకు అన్యాయం చేస్తున్నారు అంటూ కూడా కొంతమంది విజయ్ ని తప్పుపడుతున్న విషయం తెలిసిందే.అందుకే సంగీతకి మద్దతుగా నిలుస్తూ సోషల్ మీడియా ద్వారా #JusticeForSangeetha అనే హ్యాష్ ట్యాగ్ ను ట్రెండ్ చేస్తున్నారు.
హీరోయిన్ కీర్తి సురేష్ ( Keerthy Suresh )పెళ్లి సందర్భంగా త్రిష విజయ్ కలిసి గోవాకి వెళ్లిన సంగతి తెలిసిందే.ఈ పెళ్లికి హాజరయ్యేందుకు దళపతి విజయ్- త్రిషలు ప్రత్యేక విమానంలో గోవాకి వెళ్లారు.ఆ సమయంలో మీడియా కెమెరాల కంటపడ్డ త్రిష, విజయ్ ల ఫోటోలు వైరల్ అవుతున్నాయి.విజయ్ గత కొంత కాలంగా హీరోయిన్ త్రిషతో సన్నిహితంగా ఉంటున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి.
తమిళ మీడియాలో దీనిపై రకరకాల కథనాలు కూడా వస్తున్నాయి.తాజాగా కీర్తి సురేష్ వివాహానికి వీరిద్దరూ కలిసి వెళ్లడంతో ఈ రచ్చ ఇంకా రాజుకుంది.
సోషల్ మీడియాలో వినిపిస్తున్న వార్తలకు తాజాగా విడుదలైన ఫోటోలు మరింత ఆజ్యం చేకూర్చినట్టు అయింది.
విజయ్ త్రిష కోసం తన భార్య సంగీతకి అన్యాయం చేస్తున్నారంటూ కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.సోషల్ మీడియా ద్వారా #JusticeForSangeetha అనే హ్యాష్ ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు.విజయ్ భార్య సంగీత సోమలింగం అభిమానులు ఆమెకి సోషల్ మీడియా ద్వారా పెద్ద ఎత్తున మద్దతుగా నిలుస్తున్నారు.
పాతికేళ్ల వైవాహిక జీవితంలో ప్రతి విషయంలోనూ విజయ్ కి సంగీత మద్దతుగా నిలిచారు.ఆమె సహకారంతోనే విజయ్ సూపర్ స్టార్ గా నిలిచారంటూ అప్పటి విషయాలను గురించి అభిమానులు చర్చించుకుంటున్నారు.
మరి ఈ వార్తలపై విజయ్ అలాగే త్రిషలు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి మరి.