వైరల్: జలుబు చేసిందని ఇంగ్లీషులో యజమానికి చెబుతున్న చిలుక!

చిలుకలు( Parrots ) చాలా తెలివైనవి.అంతేకాదు అవి గొప్ప ఇమిటేటర్స్ అని కూడా చెప్పుకోవచ్చు.

 An African Grey Parrot Complaints To Owner That She Is Sick Video Viral Details,-TeluguStop.com

అవి మనుషుల లాగా మాటలు మాట్లాడుతూ ఆశ్చర్యపరుస్తుంటాయి.బయటికి సంబంధించిన వీడియోలు తరచూ వైరల్( Viral Video ) అవుతూ మనల్ని ఎంతగానో ఆకర్షిస్తుంటాయి.

తాజాగా ఒక ఆఫ్రికన్ గ్రే ప్యారెట్( African Grey Parrot ) వీడియో వైరల్ కాగా అందులో అది చాలా క్యూట్ గా మాట్లాడుతూ అందరినీ ఆకట్టుకుంటోంది.ఇది ఇంగ్లీషులో బాగా మాట్లాడటం చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.

ఈ చిలుక తనకు పడిశం పట్టిందని తన లేడీ ఓనర్ కి ఇంగ్లీష్ లో చెప్పడానికి ప్రయత్నించింది.దాని చిలిపి చేష్టలు, ఇమిటేటింగ్ స్కిల్స్ చూసి అందరూ ఫిదా అయిపోయారు.

అంతేకాదు ఇది తనకు జలుబు చేసిందని చెప్పడానికి వృద్ధుడి లాగా మాట్లాడింది.అలాగే దగ్గు కూడా దగ్గింది.మనుషులకు జలుబు( Cold ) చేస్తే ఎలా ప్రవర్తిస్తారో అచ్చం అలాగే ఇది బిహేవ్ చేసింది.ఈ వీడియోలో చిలుక “అమ్మ, నేను అన్ హెల్తి గా ఉన్నాను” అని అంటుంది.

అప్పుడు ఓనర్ “అవునా, నీకు అనారోగ్యంగా ఉందని నేను అస్సలు అనుకోలేదే” అని కాస్త వెటకారంగా బదిలిస్తుంది.దాంతో చిలుక తన నటన మొదలు పెడుతుంది.“అయ్యో, నాకు నిజంగానే జలుబు చేసింది” అన్నట్లుగా అది మాట్లాడుతుంది.అంతేకాదు అది తన ముక్కును చీదడం కూడా స్టార్ట్ చేస్తుంది.

చిలుకకు, ఆ లేడీ ఓనర్ కి మధ్య ఇంగ్లీషులో జరిగిన ఈ కన్వర్జేషన్ చూసి చాలామంది వావ్ అని కామెంట్లు చేస్తున్నారు.ముఖ్యంగా జంతువుల ప్రేమికులు ఈ వీడియో చూసి చాలా ముచ్చట పడుతున్నారు.

ఆఫ్రికన్ ప్యారేట్ వీడియోకి ఇప్పటికే లక్షల్లో వ్యూస్ వచ్చాయి.27,000 మందికి పైగా ఇక కామెంట్ బాక్స్ అయితే వేలాది కామెంట్స్ తో నిండిపోయింది.ఈ ప్యారెట్ పోయిన జన్మలో ఆస్కార్ అవార్డు గెలుచుకున్నా నటి అనుకుంటా, అందుకే ఇప్పుడు కూడా ఎంత బాగా నటిస్తోంది అంటూ సరదాగా కొంతమంది కామెంట్లు పెడుతున్నారు.చిలుకలు అన్ని కాలాల్లో బాగా పండ్లు తింటాయి.

అయినా వాటికి జలుబు చేయదు, అందుకే దాని ఓనర్ దీనిని నమ్మడం లేదనుకుంటా అని ఇంకొందరు ఫన్నీగా కామెంట్ చేశారు.ఈ వైరల్ వీడియోను మీరు కూడా చూసేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube