సాధారణంగా సినిమా ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీలకు ఊహించని స్థాయిలో క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్, పాపులారిటీ (Craze, fan following, popularity)ఉంటుంది.సెలబ్రిటీలకు ఉండే బలమైన బ్యాగ్రౌండ్ వల్ల వాళ్లు చిన్నచిన్న తప్పులు చేనా ఎవరూ పట్టించుకోరు.
సంధ్య థియేటర్ (Sandhya Theater)దగ్గర జరిగిన తొక్కిసలాట ఘటన అభిమానులను ఎంత బాధ పెట్టిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.బన్నీ(Bunny) సైతం ఈ విధంగా జరుగుతుందని ఊహించలేదు.
అయితే బన్నీని అరెస్ట్ చేయడం ఒకింత సంచలనం అవుతోంది.సెలబ్రిటీలు జాగ్రత్తగా ఉండకపోతే చుక్కలే అని ఈ ఘటన ద్వారా పరోక్షంగా వెల్లడవుతోంది.అయితే బన్నీ అరెస్ట్ విషయంలో ఫ్యాన్స్ నుంచి బన్నీ తప్పు లేదనే కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.బన్నీ ఇప్పటికే 25 లక్షల రూపాయలు ప్రకటించడంతో పాటు రేవతి కొడుకుకు సకాలంలో వైద్య చికిత్సలు అందేలా చర్యలు తీసుకుంటున్నారు.

అయితే ఇంత చేసినా పోయిన ప్రాణం విలువకు మాత్రం సమానం కాదు.సెలబ్రిటీలు భవిష్యత్తులో భారీ ఈవెంట్లను నిర్వహించే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉందని చెప్పవచ్చు.పొలిటికల్ పవర్ వల్లే బన్నీ అరెస్ట్ అయ్యారని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.పుష్ప2 సినిమాలో పోలీసుల చేతికి చిక్కని బన్నీ రియల్ లైఫ్(Bunny Real Life) లో చిక్కారని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.

అల్లు అర్జున్ కు బెయిల్ దక్కుతుందా లేదా అనే చర్చ సైతం సోషల్ మీడియా( social media) వేదికగా జరుగుతోంది.బన్నీ అరెస్ట్ విషయంలో వేర్వేరు వెర్షన్లు వినిపిస్తుండగా అల్లు అర్జున్ అరెస్ట్ (allu arjun arrest )గురించి ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది.అల్లు అర్జున్ బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్ లతో ప్రేక్షకులను మెప్పించాలని కామెంట్లు వినిపిస్తున్నాయి.బన్నీ రేంజ్ అంతకంతకూ పెరుగుతోంది.బన్నీ అరెస్ట్ కు సంబంధించి రాబోయే రోజుల్లో ఎలాంటి ట్విస్టులు చోటు చేసుకుంటాయో అనే చర్చ మాత్రం జోరుగా జరుగుతోంది.