ప్రముఖ సంగీత దర్శకుడు కోటి చేతుల మీదుగా హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ ( Hyderabad Prasad Labs )లో ప్రజల, ప్రభుత్వ భాగస్వామ్యంతో సామాజిక చైతన్యాన్ని కలిగించే పలు కార్యక్రమాలు చేపడుతున్న హక్కు ఇనిషేటివ్ సంస్థ ” మన హక్కు హైదరాబాద్” కర్టెన్ రైజర్ ప్రచార గీతాన్ని ఆవిష్కరించింది.ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ లో ” వై డిమాలిషన్స్ ఇన్ హైదరాబాద్” ( Why Demolitions in Hyderaba )అనే చర్చ కార్యక్రమాన్ని కూడా వారు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో హక్కు ఇనిషేటివ్ కమిటీ వారు, పలువురు ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్బంగా హక్కు ఇనిషేటివ్ ఫౌండర్ డైరెక్టర్ డా.కోట నీలిమ ( Initiative Founder Director Dr.Kota Neelim )మాట్లాడుతూ.హైదరాబాద్ నగరాన్ని సుందర నగరంగా తీర్చిదిద్దే క్రమంలో భాగంగా హక్కు ఇనిషేటివ్ నుంచి మా వంతు ప్రయత్నం చేస్తున్నామని ఆయన అన్నారు.ఇదివరకు ప్రభుత్వంలో వైన్ షాప్స్ కు విపరీతంగా అనుమతులు రావడంతో ప్రజల ఇళ్ల మధ్య వైన్ షాప్స్ తొలగించేలా ప్రజల భాగస్వామ్యంతో ప్రయత్నం చేశామని ఆయన అన్నారు.
అంతేకాకుండా హైదరాబాద్ లో వరదలు వచ్చినప్పుడు మా సంస్థ బాగా పనిచేసిందని, మేము నగరంపై మాకున్న విజ్ఞానంతోనే కాదు స్థానిక ప్రజల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని పనిచేస్తున్నామని ఈ సందర్బంగా తెలిపారు.
అలాగే ఈ కార్యాక్రమంలో భాగంగా క్రమంలో సోషల్ యాక్టివిస్ట్ పంకజ్ బాసిన్ ( Social Activist Pankaj Bassin )మాట్లాడుతూ.” వై డిమాలిషన్స్ ఇన్ హైదరాబాద్” అంశం మీద చర్చ కార్యక్రమం నిర్వహించామని, ఇందులో వివిధ రంగాలకు చెందిన ప్రముఖుల అభిప్రాయాలు సూచనలు తీసుకున్నామని, మన నగరాన్ని అందంగా మార్చేందుకు ప్రతి ఒక్కరి నుంచి సలహాలు తీసుకున్నామన్నారు.అలాగే మాంట్ పోర్ట్ సోషల్ ఇనిస్టిట్యూట్ ఫౌండేషన్ బ్రదర్ వర్గీస్ మాట్లాడుతూ.
మూసీ నది ప్రక్షాళన చాలా విస్తృతమైన అంశమమని, మూసీలోకి మురుగునీరు చేరకుండా చర్యలు చేపట్టాలని ఆయన అన్నారు.