ఖైదీలను సింహాలకు ఆహారంగా వేసేవాడు.. ఎక్కడో తెలిస్తే..

సిరియా అధ్యక్షుడు అసద్‌కు ( Syrian President Assad )చెందిన టైగర్ ఫోర్సెస్ లో తలాల్ దక్కక్ ( Talal Dakkak in Tiger Forces )అనే ఒక క్రూరమైన సభ్యుడు ఉండేవాడు.అతన్ని పశ్చిమ నగరమైన హమాలో సిరియన్ తిరుగుబాటుదారులు చంపేశారు.

 If You Know Somewhere Who Feeds Prisoners To Lions, Talal Dakkak, Syria, Tiger F-TeluguStop.com

అయితే ఇప్పుడు అతనికి సంబంధించిన కొన్ని షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి.ముఖ్యంగా ఒక విషయం అందర్నీ షాక్‌కి గురి చేస్తోంది.

అదేంటంటే దక్కక్ ఖైదీలను తన పెంపుడు సింహానికి ఆహారంగా వేసేవాడట.అతన్ని చంపడానికి చేసిన ఏర్పాట్లకు సంబంధించిన వీడియోలు ఆన్‌లైన్ లో వైరల్ అయ్యాయి, కానీ అతని మరణం ఇంకా అధికారికంగా ధృవీకరించలేదు.

“అబు సఖర్”( Abu Sakhar ) అని కూడా పిలిచుకునే దక్కక్, తన భయంకరమైన ప్రవర్తనతో అందరికీ హడల్ పుట్టించేవాడు.2005లో ఒక జూ నుంచి ఒక సింహాన్ని పట్టుకొచ్చి దానికి ఖైదీలను, అపహరించబడిన వారిని ఆహారంగా వేసినట్లు అతను తరచుగా గొప్పలు చెప్పుకునేవాడట.ఎయిర్ ఫోర్స్ ఇంటెలిజెన్స్ ( Air Force Intelligence )కింద 1,500 మంది సైనికుల విభాగానికి నాయకుడిగా, అసద్ పాలనను వ్యతిరేకించిన వారిని నిర్బంధించడం, చిత్రహింసలకు గురిచేయడం అతని బాధ్యత.

Telugu Assad Regime, Humans, Hama, Feeds Prisoners, Syria, Talal Dakkak, Tiger,

దక్కక్ కిడ్నాప్, హత్య, అవయవాల అక్రమ రవాణా వంటి అనేక నేరాల్లో పాల్గొన్నట్లు నివేదికలు చెబుతున్నాయి.హమా నుంచి ఇడ్లిబ్ వరకు ఇంధన స్మగ్లింగ్ మార్గాలను నియంత్రించడం ద్వారా అతను సంపదను పొందాడు.అతను రిజిస్టర్ చేయని వాహనాలను కూడా స్మగ్లింగ్ చేశాడు, మత్తు పదార్థాల వ్యాపారం చేశాడు.

హమాలో, అతను పౌరులను పట్టుకుని వారి కుటుంబాల నుంచి డబ్బులు డిమాండ్ చేసేవాడు.

Telugu Assad Regime, Humans, Hama, Feeds Prisoners, Syria, Talal Dakkak, Tiger,

సాధారణంగా సిరియన్ ఆర్మీ ఉన్నతాధికారులకు విధించే శిక్ష అయిన బహిరంగ ఉరి ద్వారా దక్కక్ చనిపోయాడని చెబుతున్నారు.అతని మరణం సిరియాలో కొనసాగుతున్న హింసను, అధికార పోరాటాలను హైలైట్ చేస్తుంది.ఇదిలా ఉండగా, తిరుగుబాటుదారులు డమాస్కస్‌లోకి ప్రవేశించి అధ్యక్షుడు బషర్ అసద్‌ను గద్దె దించారు.

అయినప్పటికీ, సిరియా ప్రధాన మంత్రి చాలా మంది మంత్రులు ఇంకా డమాస్కస్‌లోని తమ కార్యాలయాల్లో పనిచేస్తున్నారని ప్రకటించారు.చాలా దుకాణాలు మూతపడటం, ప్రజా రవాణా అందుబాటులో లేకపోవడంతో రాజధానిలో జీవితం నెమ్మదిగా సాధారణ స్థితికి వస్తోంది.

పరిమిత రవాణా కారణంగా కొంతమంది నివాసితులు పబ్లిక్ స్క్వేర్లలో సంబరాలు చేసుకుంటున్నారు, మరికొందరు ప్రయాణానికి ఇతర వాహనాలను ఆశ్రయిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube