మహానటి కీర్తిసురేష్ ( Keerthy Suresh ) పెళ్లి బంధంలోకి అడుగు పెట్టారు.ఈమె తన చిన్నినాటి స్నేహితుడు ఆంటోనీ తట్టిల్ ( Antony Thattil ) అనే వ్యక్తితో గత 15 సంవత్సరాలుగా ప్రేమలో ఉన్నారు.
ఇలా వీరిద్దరూ ప్రేమలో ఉంటూ పెద్దల సమక్షంలో ఎంతో ఘనంగా గోవాలో డిసెంబర్ 12వ తేదీ ఘనంగా హిందూ క్రిస్టియన్ సాంప్రదాయాల ప్రకారం పెళ్లి చేసుకున్న విషయం మనకు తెలిసినదే .ప్రస్తుతం వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఈ క్రమంలోనే సినీ సెలెబ్రెటీలు ఈ జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
ఇకపోతే కీర్తి సురేష్ ఆంటోనీ వివాహ వేడుకలలో భాగంగా కుటుంబ సభ్యులతో పాటు కొంతమంది సినీ సెలబ్రిటీలు కూడా పాల్గొన్నారు.ఇక నాచురల్ స్టార్ నాని కీర్తి సురేష్ మధ్య ఎంతో మంచి అనుబంధం ఉంది.గతంలో కీర్తి సురేష్ నాని ఫ్యామిలీ గురించి ఆయన భార్య కొడుకు గురించి ఎన్నో విషయాలు తెలియజేశారు.
నేను హైదరాబాద్ వచ్చిన ప్రతిసారి నాని ఇంటికి తన సొంత ఇంటి లాగే వెళ్తానని నాని కొడుకు నన్ను కిట్టు అత్త అంటూ చాలా ప్రేమగా పిలుస్తారు అంటూ గతంలో ఈమె తెలియజేశారు.
ఇక నాని( Nani ) కీర్తి సురేష్ కాంబినేషన్లో నేను లోకల్ దసరా వంటి సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్నాయి.ఇకపోతే తాజాగా కీర్తి సురేష్ పెళ్లి కావడంతో నాని సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.కీర్తి సురేష్ మెడలో ఆంటోనీ మూడుముళ్ళు వేయగా కీర్తి సురేష్ ఎమోషనల్ అవుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు.
ఈ ఫోటోని నాని సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.నేను మోస్ట్ మ్యాజికల్ మూమెంట్ ని చూశాను.ఆ అమ్మాయి, ఆమె ఎమోషన్ ఒక డ్రీం లాగా ఉందని నాని పోస్ట్ చేశాడు.ఈ పోస్టుకు సమంత నటి ప్రగ్య జైస్వాల్ లైక్ కొట్టడం విశేషం.