సోషల్ మీడియాలో ప్రతిరోజు పదుల సంఖ్యలో వైరల్ వీడియోలు ప్రత్యక్షమవుతూనే ఉంటాయి.ఇందులో అప్పుడప్పుడు జంతువులకు( animals ) సంబంధించిన వీడియోలు వైరల్ అవుతూనే ఉంటాయి.
సింహం, పులి, పాములు ఇలా అనేక జంతువులకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతూనే ఉంటాయి.నిజానికి వీటిని చూసేందుకు ప్రజలు కూడా బాగా ఆసక్తి చూపిస్తుంటారు.
ఇకపోతే ముఖ్యంగా జంతువులలో పులులు, సింహాలు, పాములు సంబంధించి ఎక్కువగా వీడియోలు హల్చల్ చేస్తుంటాయి.ఈ నేపథ్యంలోనే తాజాగా ఓ భారీ కొండచిలువ సింహానికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఈ వీడియో సంబంధించిన పూర్తి వివరాలు చూస్తే.
వైరల్ గా మారిన వీడియోలో ఓ భారీ కొండచిలువ( python ) సింహం పైన దాడికి దిగింది.అయితే అడవికి రాజు అయిన సింహం కూడా దాని దెబ్బకు విలవిలలాడిపోయింది.వీడియోలో గమనించినట్టుగా అయితే ఓ సింహం అడవికి దగ్గరగా ఉన్న రోడ్డుపైకి వచ్చినట్లు కనపడుతుంది.
అయితే, అదే సమయంలో సింహం పైన భారీ కొండలు చుట్టుకుని ఉండటం కూడా కనబడుతుంది.సింహం పొరపాటున ఆ కొండచిలువను తినడానికి వెళ్లిందో ఏమో తెలియదు గాని.
కొండచిలువ సింహం పైకి రివర్స్లో అటాక్ చేసినట్లు ఉంది.అయితే, ఈ ఘటనలో సింహం తెరుకొనే లోపల కొండచిలువ సింహం మీదకు దాడి చేసింది.ఈ సమయంలో సింహం చాలాసేపు ప్రాణాలతో కొట్టుమిట్టాడింది.చివరికి ఎలాగోలో కొండ చిలువ నుంచి సింహం బయటపడింది.ఈ వీడియోని చూసిన సోషల్ మీడియా వినియోగదారులు తెగ కామెంట్ చేస్తున్నారు.
ఇదివరకు ఎప్పుడూ సింహం కొండచిలువతో పోరాడిన వీడియోలో చూడలేదంటూ కొందరు కామెంట్ చేస్తుండగా.మరి కొందరేమో వామ్మో కొండచిలువ పట్టు ఎలా ఉంటుందో ఈ వీడియో చూస్తే ఇట్టే అర్థమవుతుంది అంటూ కామెంట్ చేస్తున్నారు.