డ్రైవింగ్ చేస్తూ ఇదేం పని.. ఇంటికెళ్లి చేసుకో.. టేస్టీ తేజ పై ఆగ్రహం వ్యక్తం చేసిన నేటిజన్స్!

టేస్టీ తేజ( Tasty Teja ) పరిచయం అవసరం లేని పేరు.యూట్యూబర్ గా ఎంత మంచి పేరు ప్రఖ్యాతలు సొంతం చేసుకున్న తేజ బిగ్ బాస్ (Bigg Boss) సీజన్ సెవెన్ కార్యక్రమంలో కంటెస్టెంట్ గా అవకాశమందుకున్న సంగతి మనకు తెలిసిందే.

 Netizens Fire On Bigg Boss Tasty Teja, Bigg Boss, Tasty Teja, Driving, T20 World-TeluguStop.com

ఇక ఈ కార్యక్రమంలో భాగంగా తొమ్మిది వారాల పాటు కొనసాగిన ఈయన తొమ్మిదవ వారం హౌస్ నుంచి బయటకు వచ్చారు.ఇలా తొమ్మిది వారాలపాటు బిగ్ బాస్ హౌస్ లో కొనసాగిన ఈయనకు విపరీతమైన ఫాన్ ఫాలోయింగ్ ఏర్పడింది.

ఇలా ఈ కార్యక్రమాల ద్వారా వచ్చిన క్రేజ్ ను తేజ తనదైన శైలిలో ఉపయోగించుకుంటున్నారు.

Telugu Bigg Boss, Cup, Tasty Teja, Tollywood-Movie

ఈ కార్యక్రమం ద్వారా తేజ తన వృత్తిపరమైన జీవితంలో ఎంతో సంతోషంగా ఉన్నారు.  ప్రస్తుతం బిజినెస్ రంగంలోకి అడుగుపెట్టి పలు రెస్టారెంట్లను ప్రారంభించిన తేజ మరోవైపు యూట్యూబ్ ఛానల్ ద్వారా వీడియోలను చేస్తూ భారీగా సంపాదిస్తున్నారు.ఇకపోతే సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా కనిపించే తేజ ఇటీవల ఒక వీడియోని షేర్ చేయడంతో పెద్ద ఎత్తున ట్రోల్స్ ఎదుర్కొంటున్నారు.

ఇటీవల టీ20 వరల్డ్ కప్( T20 World Cup ) మ్యాచ్ జరిగిన సంగతి మనకు తెలిసిందే.

Telugu Bigg Boss, Cup, Tasty Teja, Tollywood-Movie

ఈ క్రమంలోనే టేస్టీ తేజ కార్ డ్రైవింగ్ ( Driving) చేస్తూ తన స్టీరింగ్ పై మొబైల్ ఫోన్ పెట్టుకుని మ్యాచ్ అప్డేట్స్ చూస్తూ వచ్చారు.ఇలా ఇందుకు సంబంధించిన ఈ వీడియోని షేర్ చేస్తూ క్రికెట్ పై తనకున్న అభిమానాన్ని తెలియజేసే క్రమంలోనే ట్రోల్స్ కి గురి అవుతున్నారు.ఇక ఈ వీడియో పై నెటిజన్స్ స్పందిస్తూ విభిన్న రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.

ఇలా కారు డ్రైవింగ్ చేస్తూ క్రికెట్ చూడటం ఏంటి.నీకు అంతగా చూడాలని ఉంటే కారు పక్కన పెట్టి మ్యాచ్ అప్డేట్స్ చూడు లేకపోతే ఇంటికెళ్లి శుభ్రంగా చూడు.

ఒక సెలబ్రిటీ అయినా మీరు అంతే బాధ్యతగా నడుచుకోవాలి కదా అంటూ కామెంట్లు చేస్తూ మండిపడుతున్నారు.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube