మాయమాటలతో జనానికి కుచ్చుటోపీ.. సింగపూర్‌లో భారత సంతతి మహిళకు జైలు

వివిధ స్కామ్‌లలో 12 మందిని దాదాపు 1,06,000 సింగపూర్ డాలర్ల మేర మోసం చేసిన కేసులో భారత సంతతికి చెందిన మహిళకు సింగపూర్ కోర్టు( Singapore Court ) బుధవారం మూడేళ్ల జైలు శిక్షతో పాటు 2000 సింగపూర్ డాలర్ల జరిమానా విధించింది.నిందితురాలిని ప్రిస్కిల్లా షమణి మనోహరన్‌గా( Priscilla Shamani Manoharan ) గుర్తించారు.2022 నుంచి ఆమె ఈ నేరాలకు పాల్పడినట్లుగా తెలుస్తోంది.హౌసింగ్ బోర్డ్ పబ్లిక్ స్కీమ్( Housing Board Public Scheme ) కింద అపార్ట్‌మెంట్‌కు చెందిన లావాదేవీకి డబ్బు చెల్లించాల్సి ఉందని అయితే తన కొడుకు, కుమార్తె చనిపోయినట్లుగా చెబుతూ మనోహరన్ ఒక వ్యక్తిని 57,250 సింగపూర్ డాలర్ల మేర మోసం చేసింది.

 Indian-origin Woman Jailed In Singapore For Cheating 12 Persons Of Over Sgd 1060-TeluguStop.com

అంతేకాదు.తానే చనిపోయినట్లుగా తప్పుడు పత్రాలు సృష్టించి, లాయర్‌గా నటిస్తూ లీగల్ ఫీజుల కోసం ఆ వ్యక్తికి బూటకపు ఇన్‌వాయిస్‌లను( Fake Invoices ) పంపినట్లు ది స్ట్రెయిట్స్ టైమ్స్ వార్తాపత్రిక నివేదించింది.

ఇతర కేసులతో పాటు మెడికల్ ఫీజు కోసం అత్యవసరంగా డబ్బు చెల్లించాల్సి ఉందంటూ ఆసుపత్రికి , తనకు మధ్య జరిగినట్లుగా నకిలీ వాట్సాప్ రికార్డులను సృష్టించింది.

Telugu Drmaninder, Boardpublic, Indian Origin, Jailed, Sgd, Singapore-Telugu NRI

అలా ప్రజలను మోసం చేయడమే ప్రవృత్తిగా సాగించింది మనోహరన్. ఈ ఏడాది ప్రారంభంలోనూ ఇద్దరు వ్యక్తులను 11,800 డాలర్ల మేర ఆమె మోసానికి పాల్పడినట్లు దర్యాప్తులో తేలింది.జూన్ 20వ తేదీన జరిగిన విచారణ సందర్భంగా తన అపార్ట్‌మెంట్‌లోని గదులను అద్దెకు ఇవ్వడం సహా పలు మోసాలకు సంబంధించి ఆరు ఆరోపణలను అంగీకరించింది.

అలాగే శిక్ష విధించే సమయంలో మరో 14 ఇతర అభియోగాలను పరిగణనలోనికి తీసుకుంది న్యాయస్థానం.

Telugu Drmaninder, Boardpublic, Indian Origin, Jailed, Sgd, Singapore-Telugu NRI

కాగా.ఈ ఏడాది ప్రారంభంలో చట్టవిరుద్ధంగా రోగులకు మత్తుమందులను సూచిస్తున్నాడన్న అభియోగాలపై సింగపూర్‌కు చెందిన డిసిప్లినరీ ట్రిబ్యునల్ భారత సంతతికి చెందిన డాక్టర్‌పై సస్పెన్షన్ వేటు వేసింది.నిందితుడిని డాక్టర్ మణీందర్ సింగ్ షాహిగా( Dr Maninder Singh Shahi ) గుర్తించారు.

అతనికి 35 సంవత్సరాలకు పైగా అనుభవంతో పాటు దశాబ్ధానికి పైగా క్లినిక్ నడుపుతున్నట్లు ఛానెల్ న్యూస్ ఏషియా తెలిపింది.షాహి.తన రోగులలో ఏడుగురికి మత్తుమందులను సిఫారసు చేసినట్లు దర్యాప్తులో తేలింది.ఈ నేరానికి గాను మణీందర్ షాహిని మూడేళ్ల పాటు మెడికల్ ప్రాక్టీస్ నుంచి సస్పెండ్ చేసింది ట్రిబ్యునల్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube