అమరావతికి స్పెషల్ గ్రాంట్ ?  బాబు ప్రతిపాదన సక్సెస్ అవుతుందా ? 

ప్రస్తుతం టిడిపి అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు( CM Chandrababu ) ఢిల్లీలోనే పర్యటిస్తున్నారు.ఏపీకి సంబంధించి అనేక పెండింగ్ ప్రాజెక్టుల నిధుల విడుదలకు సంబంధించి కేంద్ర బిజెపి పెద్దలను కలుస్తున్నారు.

 Special Grant For Amaravati Will Cm Chandrababu Proposal Be Successful Details,-TeluguStop.com

నిన్ననే ప్రధాని నరేంద్ర మోదితో( PM Narendra Modi ) ప్రత్యేకంగా భేటీ అయిన చంద్రబాబు ఈరోజు అనేకమంది కేంద్రమంత్రులను కలిశారు.ఏపీకి రావలసిన నిధులు , ఇతర ప్రయోజనాలు గురించి వారితో ప్రధానంగా చర్చించారు .ఈరోజు సాయంత్రం ఢిల్లీ నుంచి ఆయన హైదరాబాద్ కు బయలుదేరి రానున్నారు.నిన్న ప్రధానితో చంద్రబాబు భేటీ అయిన సందర్భంగా ఏపీలోని అనేక రాజకీయ అంశాల పైన చర్చించారు.

Telugu Amaravathi, Ap Amaravati, Chandrababu, Cm Chandrababu, Telugudesham-Polit

ముఖ్యంగా ఏపీ పునర్విభజన చట్టంలో పొందుపరిచిన హామీలను అమలు చేయడంతో పాటు,  వివిధ అభివృద్ధి పనుల నిమిత్తం రాజధానికి ఆర్థికంగా అండదండలు అందించాలని ప్రధానిని కలిసి విజ్ఞప్తి చేశారు.అమరావతి తో( Amaravati ) పాటు , పోలవరం ప్రాజెక్టు( Polavaram Project ) నిర్మాణం వెంటనే విడుదల చేయాలని ప్రధాని కోరారు.తాజాగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ , వైద్య ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డాతో ప్రత్యేకంగా చంద్రబాబు భేటీ అయ్యారు.ఈ సందర్భంగా ఆర్థికపరమైన అంశాలను నిర్మల సీతారామన్ కు చంద్రబాబు వివరించారు .ఈ సందర్భంగా ప్రధాని మోదీతో చర్చించిన అంశాలను నిర్మల సీతారామన్ కు వివరించారు.ఏపీలో టిడిపి కూటమి ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న అమరావతి ప్రాంతంలో , మౌలిక సదుపాయాలను కల్పించేందుకు అవసరమైన నిధులను వెంటనే విడుదల చేయాలని చంద్రబాబు కోరారు.

Telugu Amaravathi, Ap Amaravati, Chandrababu, Cm Chandrababu, Telugudesham-Polit

అసంపూర్తిగా ఉన్న ప్రభుత్వ భవనాల నిర్మాణాన్ని పూర్తిచేసేందుకు కేంద్రం అన్ని విధాలుగా సహకరించాలని విజ్ఞప్తి చేశారు.ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్స్, ఫైనాన్షియల్ క్లస్టర్స్, ఎకనామిక్ కారిడార్లను ఏర్పాటు చేయాలని కోరారు.దీనికి అవసరమైన ప్రోత్సాహకాలను ప్రకటించాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు.ఈ సందర్భంగా త్వరలో పార్లమెంట్  ప్రవేశపెట్టబోయే మధ్యంతర బడ్జెట్ లో అమరావతి నిర్మాణానికి అవసరమైన ప్రత్యేక నిధులను పొందుపరచాలని చంద్రబాబు నిర్మలా సీతారామన్ కు( Nirmala Sitaraman ) విజ్ఞప్తి చేసినట్లు సమాచారం.

అదే జరిగితే అమరావతికి కేంద్రం స్పెషల్ గ్రాండ్ ను కేంద్ర బడ్జెట్ లో ప్రకటించే అవకాశం ఉంది .ప్రస్తుతం ఎన్డీఏ కూటమిలో కీలక భాగస్వామిగా టిడిపి ఉండడం తో,  చంద్రబాబు విజ్ఞప్తులను కేంద్రం వెంటనే పరిష్కరించే అవకాశం ఉంది.అదే జరిగితే అమరావతి లో అభివృద్ధి పరుగులు పెట్టే అవకాశం ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube