తెలంగాణలో కాంగ్రెస్( Congress ) అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఒక్కొక్కరుగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు , కీలక నాయకులు కాంగ్రెస్ లో చేరిపోతున్నారు.ఈ చేరికల పరంపర ఇంకా కొనసాగుతూనే ఉంది.
ఇప్పటికే కొంతమంది ఎమ్మెల్యేలు చేరిపోగా, మరి కొంతమంది చేరేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు.ఈ వలసలకు బ్రేక్ వేసేందుకు బీఆర్ఎస్ అధినేత కేసిఆర్ ఫామ్ హౌస్ ( KCR Farm House )లో మీటింగ్ పెట్టి అందరిని బుజ్జగించే ప్రయత్నం చేశారు.
ఈ మీటింగ్ కు కొంత మంది డుమ్మా కొట్టారు.మరి కొంతమంది హాజరైనా తమ ప్రయత్నాలు మాత్రం వదిలిపెట్టలేదు .బీఆర్ఎస్ ఓటమితో దేశం బాధపడిపోతుందని కేసిఆర్ సమావేశంలో వ్యాఖ్యానించారు .కానీ పార్టీ మారాలనుకున్న ఎమ్మెల్యేలు, ఇతర కీలక నాయకులు మాత్రం కెసిఆర్ మాటలను పెద్దగా పరిగణలోకి తీసుకోనట్టు గా వ్యవహరిస్తున్నారు.
పార్టీ మారే ఆలోచనతో ఉన్న వారంతా ఆప్షన్ గా కాంగ్రెస్ ను మాత్రమే చూస్తూ ఉండడం, బిజెపిని ( BJP )పెద్దగా పట్టించుకోకపోవడం చర్చినీయాంశంగా మారింది.కేంద్రంలో బిజెపి అధికారంలో ఉన్న రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ వైపే బీఆర్ఎస్ నుంచి వలస వెళ్లే వారంతా చూస్తున్నారు.అయితే బీజేపీలోని ఓ కీలక నేత కాంగ్రెస్ లోకి వెళ్లే బీఆర్ఎస్ నేతలను ఆపేందుకు ప్రయత్నిస్తూ, బిజెపిలోకి రావాలని , ఒకవేళ బీజేపీ లో చేరేందుకు అవకాశం లేకపోతే, బీఆర్ఎస్ లోనే ఉండాలంటూ హెచ్చరికలు కూడా చేస్తున్నట్లుగా రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది.అయితే పార్టీ మారాలి అనుకున్న ఎమ్మెల్యేలు మాత్రం కాంగ్రెస్ వైపే అడుగులు వేస్తున్నారు.
కానీ బిజెపి ఆపరేషన్ ఆకర్స్ ప్రయోగిస్తే , భారీ స్థాయిలో ఎమ్మెల్యేలను చేర్చుకునేందుకు ఎంతకైనా తెగిస్తుంది .
గతంలో తెలంగాణలో చేసిన ఈ తరహా ప్రయత్నాలు పెద్దగా వర్కౌట్ కాకపోవడంతో, ఇప్పుడు ఆ ప్రయోగం చేసేందుకు బిజెపి ఆసక్తి చూపించడం లేదు. తెలంగాణలో బీఆర్ఎస్ ( BRS in Telangana )ఎంత బలహీనమైతే బిజెపికి అంత లాభం ఉంటుంది.బీఆర్ఎస్ అధినేత కేసిఆర్ బిజెపితోనూ అంతర్గతంగా సన్నిహితంగా మెలుగుతారనే ఉద్దేశంతోనే బిజెపిలో చేరడం కంటే కాంగ్రెస్ బెటర్ ఆప్షన్ గా బీఆర్ఎస్ ను వేడాలనుకుంటున్న నేతలు చూస్తున్నారట.