వర్షాకాలంలో ఈ న్యాచురల్ సీరంను వాడితే హెయిర్ ఫాల్ తో ఇక నో టెన్షన్!

వర్షాకాలంలో( rainy season ) సహజంగానే చాలామంది హెయిర్ ఫాల్ సమస్యతో బాధపడుతూ ఉంటారు.వర్షంలో తడవడం, వాతావరణం వచ్చే మార్పులు ఇందుకు ప్రధాన కారణాలుగా మారుతాయి.

 Hair Fall Will Go Away If You Use This Natural Serum During Rainy Season! Hair F-TeluguStop.com

మీరు కూడా హెయిర్ ఫాల్ కారణంగా సతమతం అవుతున్నారా.? జుట్టు రాలడాన్ని ఎలా అడ్డుకోవాలో తెలియడం లేదా.? అయితే అస్సలు టెన్షన్ వద్దు.ఇప్పుడు చెప్పబోయే న్యాచురల్ సీరం ను వాడితే హెయిర్ ఫాల్ దెబ్బకు కంట్రోల్ అవుతుంది.

అదే సమయంలో మరెన్నో ప్రయోజనాలు కూడా పొందుతారు.మరి ఇంతకీ ఆ న్యాచురల్ సీరం ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.

Telugu Care, Care Tips, Fallnatural, Serum, Healthy, Latest, Natural Serum, Rain

ముందుగా రెండు ఉసిరికాయలు( amla ) తీసుకుని వాటర్ తో శుభ్రంగా కడిగి గింజ తొలగించి ముక్కలుగా కట్ చేసుకోవాలి.ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో కట్ చేసి పెట్టుకున్న ఉసిరికాయ ముక్కలు, ఒక చిన్న కప్పు కొబ్బరి ముక్కలు( Coconut pieces ) వేసి వాటర్ పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుంచి స్ట్రైనర్ సహాయంతో జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ జ్యూస్ లో వన్ టేబుల్ స్పూన్ అలోవెరా జెల్( Aloe vera gel ), వన్ టేబుల్ స్పూన్ కోకోనట్ ఆయిల్ వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటే మన సీరం అనేది సిద్ధమవుతుంది.

Telugu Care, Care Tips, Fallnatural, Serum, Healthy, Latest, Natural Serum, Rain

ఈ సీరం ను స్కాల్ప్ తో పాటు జుట్టు మొత్తానికి అప్లై చేసుకుని సున్నితంగా మసాజ్ చేసుకోవాలి.సీరం అప్లై చేసుకున్న గంట లేదా రెండు గంటల అనంతరం మైల్డ్ షాంపూ ను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.వారానికి ఒకసారి ఈ న్యాచురల్ సీరం ను వాడితే జుట్టు కుదుళ్ళు బలోపేతం అవుతాయి.అదే సమయంలో జుట్టు రాలడం చాలా వేగంగా త‌గ్గుముఖం పడుతుంది.అలాగే సీరంను వాడడం వల్ల కురులు ఆరోగ్యంగా మారతాయి.ఒత్తుగా పొడుగ్గా పెరుగుతాయి.

చుండ్రు సమస్య ఉంటే దూరం అవుతుంది.మరియు జుట్టు చిట్లిపోయే సమస్య సైతం కంట్రోల్ అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube