హిందూ సంప్రదాయాల ప్రకారం మనం ప్రతిరోజూ పూజ చేస్తుంటాం.ప్రతీ రోజూ కాకపోయినా మన వీలుని బట్టి వారానికి ఓ రెండు రోజుల్లోనైనా కచ్చితంగా చేసుకోవచ్చు.
అయితే ఆ పూజలో వివిధ రకాల పూలను వినియోగిస్తుంటాం.స్వామి వారికి అనేక రకాల పుష్పాలను సమర్పిస్తాం.
అయితే అష్టవిధ పుష్పాల గురించి ప్రతీకాత్మకంగా చెప్పారు.అంటే అసలు అష్టవిధ పుష్పాలు అంటే ఏమిటి అనే దానికి ఓ పురాణ కథ ఉంది.
శ్రీ స్కాంద మహాపురాణంలోని రేవాఖండంలో 51వ అధ్యాయనంలో దీని గురించి ప్రత్యేకంగా వివరించారు.అయితే ఆ కథ ఏంటి, అష్ట విధ పుష్పాలు అంటే ఏమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
పూర్వ కాలం నర్మదా తీరంలో అమరకంటకం అనే ఓ పర్వతం ఉండేది.అక్కడే నర్మతలో శూలభేద తీర్థం ఉంది.
అయితే ఆ తీర్థం దగ్గర అమక కంటక పర్వతం మీద ఓ గుహం ఉంది.ఆ గుహలో శ్రీమార్కండేయ మహర్షి వెయ్యి దివ్య సంవత్సరాలు తపస్సు చేశాడు.
ఒక శివలింగాన్ని కూడా అక్కడ ప్రతిష్టించాడు.ఆ స్వామికి మార్కండేయుడని పేరు.
ఆ లింగ మూర్తికి అష్టవిధ పుష్పాలతోనూ అష్టవిధ మానసిక పుష్పాల తోనూ పూజ చేయాలి.ఆ అష్టవిధ పుష్పాలు.
వారిజ పుష్పం అంటే దేవుడికి అభిషేకం చేయడం.రెండోది సౌమ్య పుప్పం అంటే భగవంతుడికి తేనె, నెయ్యి, పాలు, నివేదించడం.
ఆగ్నేయ పుప్పం అంటే ధూప, దీపాలు సమర్పించడం.వాయువ్య పుష్పం అంటే చందమం వంటివి సమర్పించడం.పార్థివ పుఫ్పార్చనం అంటే కంద మూలాల్ని నైవేద్యంగా సమర్పించడం.వానస్సత్య పష్పోపహారం అంటే ఫలాల్ని సమర్పించడం.ప్రాజాపత్య పుష్ప సమర్పణం అంటే దేవుడికి వేద పురాణావ్ని చదివి వినిపించడం.అలాగే శివ పుష్ప సమర్పణం అంటే భక్తుడు తన మనోవాసనల్ని సమర్పించడం.