మన హిందూ సంప్రదాయాల ప్రకారం పాలకు చాలా ప్రాముఖ్యత ఉంది.అప్పుడే పుట్టిన శిశువు నుంచి ఆ భగవంతుడి వరకు అందరికీ పాలంటే ఇష్టమే.
అయితే పాలతో చేసే పదార్థాలు, అనేక రకాల వంటకాలను భగవంతుడికి నైవేద్యంగా సమర్పిస్తుంటాం.అంతే కాకుండా అభిషేకాలు కూడా చేస్తుంటాం.
మరి అంత గొప్ప విశిష్టత కల్గిన పాలను మనం తొక్కితే పాపం చుట్టుకుంటుంది అని చాలా మంది అంటుంచారు.అయితే అది ఎంత వరకు నిజమో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
లక్ష్మీ దేవి పాలలోనే పుట్టింది.పాలే ఆ దేవికి నివాస స్థలం.
ఆ కారణం చేతనే పాలను తొక్కకూడదని చెబుతుంటారు.ఒక చుక్క పాలు తయారు కావడానికి శరీరానికి ఎంతో శక్తి కావాలి.
పాలల్లో సంపూర్ణ శక్తి ఉంటుంది.తాగిన వెంటనే మనిషికి శక్తిని చేకూర్చేది పాలు ఒక్కటే.
ద్రవాహారంలో పాలు, ఘనాహారంలో చేప… ఈ రెండు ఆహారాలు అతి వేగంగా శరీరానికి శక్తిని అందిస్తాయి.పాలు అమృతంతో సమానం.
ఏ కారణం చేతనైనా పాలు, పాలతో తయారు చేసిన పదార్థాలను వృథా చేయడం మహా పాపం.అందువల్లనే పూర్వ జాతి జీవనోన్నతికి కారణమైన ఆవు, మేక, గొర్రెలను కాలితో తన్నరాదని చెప్తారు.
అయితే మనిషి తన మేధా శక్తితో సృష్టించ లేనివి పాలు ఒక్కటేనట.అంతే కాదు ఎవరైనా గ్లాసుడు పాలు ఇచ్చినా అంటే దానం చేసినా వారు మన తల్లితో సమానమని పురాణాలు చెబుతున్నాయి.
పాలు సమృద్ధిగా ఉన్న ఇంటిని శనీశ్వరుడు చూడను కూడా చూడలేడట.దరిద్ర దేవత కూడా ఆ ఇంటికి రాదట.