జ్యోతిష్య శాస్త్రాన్ని మన భారతీయులే కాకుండా ప్రపంచవ్యాప్తంగా చాలామంది నమ్ముతారు.ఇదే కాకుండా మనదేశంలో చేతి రేఖలు, రాశి ఫలాల పై కూడా చాలామంది ప్రజల నమ్మకం ఉంది.
జ్యోతిష్య శాస్త్రం లో 12 రాశులు ఉంటాయి.ఈ రాశులలో ఒక్కొక్క రాశికి చెందినవారు ఒక్కొ రకంగా ప్రవర్తిస్తూ ఉంటారు.
కొన్ని రాశుల వారు చాలా కఠినంగా ప్రవర్తిస్తారు.మరికొన్ని రాశుల వారు చాలా మంచి స్వభావం కలిగి ఉంటారు.
మిధున రాశి కి చెందినవారు మంచి స్వభావం కలిగి ఉండి, ఇతరులకు సహాయం చేయడానికి ముందుకి వస్తారు.ఈ రాశి వారి దగ్గర ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది.
కర్కాటకం రాశిలో జన్మించిన వారు ఎప్పుడు స్నేహితుల కు బంధువులకు మద్దతుగా ఉంటారు.ఈ రాశి వారు ఎవరికైనా సహాయం చేయవలసి వస్తే వారికి చేతనయినంత సహాయం చేస్తారు.
కన్యా రాశి వారిది కూడా చాలా మంచి మనసు.వీరు తమ స్నేహితులు ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే వారిని విడిచిపెట్టి ఉండరు.ఈ రాశి వారు మానవ సంబంధలకు ఎక్కువ విలువ ఇస్తారు.

తుల రాశి కి చెందిన వ్యక్తులు ప్రతి సంబంధాన్ని వ్యక్తిగతంగా తీసుకుంటారు.వీరిలో ఎక్కువగా ప్రజలకు సేవ చేయాలన్న కోరిక ఉంటుంది.స్నేహితులు, కుటుంబ సభ్యుల కోసం వీరు ఎక్కడికైనా వెళ్తారు.
మీనా రాశి వారు ఎప్పుడూ ఇతరుల గురించి ఎక్కువ గా ఆలోచిస్తూ ఉంటారు.ఈ రాశి వారికి దయాగుణం ఎక్కువ.ఇతరుల కు సహాయం చేయడానికి వారు నష్టపోయే స్వభావం వీరి సొంతం.అలాగే ఈ రాశి వారు స్నేహానికి చాలా ప్రాధాన్యత ఇస్తారు.
ఈ రాశుల వారు కష్టాల్లో ఉన్నవారికి సహాయం చేస్తారని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది.