స్టార్ హీరోల లైఫ్ ఎంత బిజీగా ఉంటుందన్న విషయం తెలిసిందే.ఎప్పుడూ వరుస చిత్రాలతో బిజీ షెడ్యూల్ తో లైఫ్ లో గ్యాప్ లేకుండా బిజీబిజీగా ఉంటారు.
అయితే కొందరు హీరోలు మాత్రం ఎంత బిజీగా ఉన్నా తమ ఫ్యామిలీకి టైం ను కేటాయించడంలో ఏమాత్రం వెనుకాడరు.కాస్త టైం దొరికితే చాలు భార్య బిడ్డలతో టైం స్పెండ్ చేయడానికి ప్లాన్ చేస్తుంటారు.
ఇలాంటి హీరోల గురించి మాట్లాడితే ముందుగా గుర్తొచ్చేది ఐకాన్ స్టార్ అల్లు అర్జునే.ఈ స్టైలిష్ స్టార్ షూటింగ్స్ కాస్త గ్యాప్ వచ్చినా చాలు ఫ్యామిలీతో ఫుల్ గా ఎంజాయ్ చేస్తారన్న సంగతి తెలిసిందే.
అయితే రీసెంట్ గా సినిమా పూర్తయిన తరవాత మరో ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడానికి మధ్య వచ్చిన గ్యాప్ లో ఫ్యామిలీతో వేకేషన్స్ ప్లాన్ చేసి ఫారిన్ ట్రిప్ ప్లాన్ చేసిన హీరోల గురించి ఒక లుక్కేద్దాం పదండి.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఏమి చేసినా సంథింగ్ స్పెషల్ గానే అట్రాక్ట్ చేస్తుంది.
ఇటీవలే తన బర్త్డే సందర్భంగా భార్య తో కలిసి స్నేహితుల మద్య సెర్బియా లో గ్రాండ్ గా బర్త్ డే ని సెలబ్రేట్ చేసుకున్న సంగతి తెలిసిందే.ఇదే తరహాలో ఈ మధ్య చాలా వెకేషన్స్ ను ఫ్యామిలీ తో ఎంజాయ్ చేశారు ఈ హీరో.
ట్రిపుల్ ఆర్ మూవీ గ్యాప్ తర్వాత తారక్ ఆయన సతీమణి లక్ష్మి ప్రణతి, రామ్ చరణ్ తేజ్ ఆయన సతీమణి ఉపాసనా కలిసి లాంగ్ ట్రిప్ ప్లాన్ చేసి మరీ వెకేషన్ ను ఎంజాయ్ చేశారు.ఇక ప్రజెంట్ ఏమో సర్కారు వారి పాట సినిమా షూటింగ్ అలా అయ్యిందో లేదో ఇలా భార్య బిడ్డల్ని తీసుకొని వెకేషన్ కి వెళ్ళిపోయారు మిల్క్ బాయ్ మహేష్ బాబు.
రీసెంట్ గా పారిస్ లో సంతోషంగా సందడి చేస్తున్న మహేష్ మరియు నమ్రత వారి పిల్లలు ఆ ఫోటోలను సోషల్ మీడియాల్లో పోస్ట్ చేశారు.
ఇక రీ ఎంట్రీ తరవాత వరుస చిత్రాలతో బిజీ అయిపోయిన మెగాస్టార్ సైతం ఇపుడు ఆయన సతీమణితో వెకేషన్ లో ఉన్నారు.ఆచార్య సినిమా షూటింగ్ తరవాత కాస్త గ్యాప్ తీసుకుని సతీమణి ని వెంట పెట్టుకుని యూరప్, అమెరికా లను చుట్టేసేందుకు ప్లాన్ చేశారు.తాజాగా ఈ వెకేషన్ కి సంబందించిన ఫోటోలను షేర్ చేస్తూ తన హ్యాపీనెస్ ని షేర్ చేసుకున్నారు చిరు.
ఇలా మన స్టార్ హీరోలు వరుస పెట్టి ఫ్యామిలీస్ తో వెకేషన్స్ ఎంజాయ్ చేస్తున్నారు.నిజం చెప్పాలంటే కరోనా లాక్ డౌన్ తర్వాత హీరోలు వారి ఫ్యామిలీస్ తో కలిసి ఎక్కువగా వెకేషన్స్ ప్లాన్ చేస్తున్నారు.
ఇక పార్టీలు, వేడుకలు సదా మామూలే.