సాధారణంగా కొందరికి ముఖంపై నల్లటి మచ్చలు( Black spots ) ఏర్పడుతుంటాయి.ఇవి ఓ పట్టాన అస్సలు పోవు.
పైగా అందం మొత్తాన్ని పాడు చేస్తుంటాయి.ముఖం పై నల్లటి మచ్చలను వదిలించుకునేందుకు రకరకాల క్రీములు వాడుతుంటారు.
అయితే మార్కెట్లో లభ్యమయ్యే క్రీములు కంటే ఎఫెక్టివ్ గా పని చేసే మోస్ట్ ఎఫెక్టివ్ రెమెడీస్ ఉన్నాయి.ఈ రెమెడీస్ తో నల్ల మచ్చలను సులభంగా పోగొట్టుకోవచ్చు.

రెమెడీ 1
: ఒక బౌల్ తీసుకొని అందులో వన్ టీ స్పూన్ దాల్చిన చెక్క పొడి( Cinnamon powder ) వేసుకోవాలి.అలాగే వన్ టీ స్పూన్ హనీ( Honey ), వన్ టీ స్పూన్ లెమన్ జ్యూస్ ( Lemon juice )మరియు వన్ టీ స్పూన్ రోజ్ వాటర్ వేసుకుని అన్ని మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి.ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకుని 15 నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.ఆపై వాటర్ తో శుభ్రంగా చర్మాన్ని క్లీన్ చేసుకోవాలి.రెగ్యులర్ గా ఈ రెమెడీని కనుక పాటిస్తే ముఖంపై ఎలాంటి మొండి మచ్చలు ఉన్న క్రమంగా మాయం అవుతారు.పిగ్మెంటేషన్ సమస్య ( Pigmentation problem )కూడా దూరమవుతుంది.
స్కిన్ కలర్ అనేది ఈవెన్ గా మారుతుంది.అలాగే బ్రైట్ గా కూడా మెరుస్తుంది.

రెమెడీ 2
: ముఖం పై నల్లటి మచ్చలను మాయం చేయడానికి మరొక అద్భుతమైన రెమెడీ కూడా ఉంది.అందుకోసం ఒక బౌల్ తీసుకుని అందులో వన్ టేబుల్ స్పూన్ చందనం పొడి, వన్ టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్( Coffee powder ) వేసుకోవాలి.అలాగే వన్ టేబుల్ స్పూన్ అలోవెరా జెల్, వన్ టీ స్పూన్ రోజ్ వాటర్ మరియు వన్ టీ స్పూన్ లెమన్ జ్యూస్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.ఈ మిశ్రమాన్ని ముఖానికి పూతల అప్లై చేసి 20 నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.
ఆపై వాటర్ తో శుభ్రంగా చర్మాన్ని క్లీన్ చేసుకోవాలి.ముఖంపై ఏర్పడిన నల్లటి మచ్చలను వదిలించడంలో ఈ రెమెడీ కూడా చాలా పవర్ ఫుల్ గా పని చేస్తుంది.
రెండు రోజులకు ఒకసారి ఈ రెమెడీని కనుక పాటిస్తే స్పాట్ లెస్ అండ్ గ్లోయింగ్ స్కిన్ మీ సొంతం అవుతుంది.







