హిందూమతం లో కొబ్బరి కాయను కచ్చితంగా ఏదో ఒక పూజ లో ఉపయోగిస్తూ ఉంటారు.ఏదైనా పండుగ లేదా గృహ ప్రవేశం, ప్రత్యేక పెద్ద షాపింగ్ లేదా వివాహ వేడుకల పూజ అయిన కొబ్బరికాయను ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది.
అయితే మగవారు లేదా అబ్బాయిలు ఎప్పుడూ కొబ్బరి కాయను పగలగొట్టడం మనం గమనిస్తూనే ఉంటాం.మహిళలు కొబ్బరికాయ పగలగొడతామని ఎప్పుడూ చెప్పారు.
కొబ్బరికాయను హిందూమతంలో చాలా పవిత్రమైనదిగా భావిస్తూ ఉంటారు.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొబ్బరి నీరు చంద్రునికి చిహ్నంగా భావిస్తారు.
దానిని దేవునికి సమర్పించడం వల్ల సుఖం, శ్రేయస్సు లభిస్తుందని పెద్దవారు చెబుతూ ఉంటారు.అదే సమయంలో ఇది దుఃఖం బాధలను దూరం చేస్తుంది.
స్త్రీలకు కొబ్బరికాయ పగలగొట్టడం ఎందుకు నిషేధించబడిందో, దాని వెనుక ఉన్న శాస్త్రీయ కారణం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఆడవారు కొబ్బరికాయను పగలగొట్టడం హిందూ మతంలో నిషేధించబడింది.ఎందుకంటే కొబ్బరికాయ ఒక విత్తనం మరియు స్త్రీలు సంతనానికి కారకులు వారు ఒకే విత్తనం నుంచి సంతనం కలిగి ఉంటారు.అందుకే మహిళలు ఎప్పుడు కొబ్బరి కాయను పగలగొట్టారు.
మహిళలు కొబ్బరి కాయలు పగలగొడితే వారి పిల్లల జీవితాల్లో అనేక సమస్యలు తలెత్తుతాయని చాలా మంది నమ్ముతారు.
కొబ్బరికాయకు హిందూ మతంబు ఎంతో ప్రాముఖ్యత ఉంది.పురాణాల ప్రకారం విష్ణువు మరియు తల్లి లక్ష్మీ దేవి భూమి పై కొబ్బరికాయ చెట్లను నాటినట్లు చెబుతూ ఉంటారు.కాబట్టి దీనిని చాలా పూజ కార్యక్రమాలలో ఉపయోగిస్తారు.
మీరు ఎప్పుడూ గమనించే ఉంటారు.కలశం పైన కొబ్బరికాయను ఉంచడం గణపతి చిహ్నంగా భావిస్తారు.
ఇంకా చెప్పాలంటే అన్ని పనుల లో వినాయకుని పూజ కు మొదటి స్థానం ఇవ్వబడుతుందని వేద పండితులు చెబుతూ ఉంటారు.
DEVOTIONAL