గురువారం జన్మించిన వారిపై బృహస్పతి గ్రహం యొక్క ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది.వీరు సాహసవంతులు, శ్రమ జీవులుగా ఉంటారు.
ఏకాగ్రతతో పనులు చేయటం వలన శత్రువులు ఎక్కువగా ఉంటారు.అయితే మీకు ఉన్న బుద్ధిబలం ముందు ఎవరు నిలబడలేరు.
మీరు చాలా గంభీరంగా ఉండుట వలన మిమ్మల్ని చూసి అందరు కాస్త భయపడుతూ ఉంటారు.
మీ ఆలోచనలో ఉండే అర్ధాలతో ఎదుటివారు మీ పట్ల ఆకర్షితులు అవుతారు.
మీ ఆనందం, సరదాల కోసం చాలా విచ్చలవిడిగా ఖర్చు చేస్తారు.దాంతో మీ దగ్గర ధనం నిలవదు.
మీకు చాలా ఎక్కువగా స్నేహితులు ఉంటారు.కానీ విశ్వాసంగా ఉండే వారు మాత్రం చాలా తక్కువ.
మీరు మీకున్న వాక్ చాతుర్యంతో ఎక్కడైనా నెట్టుకురాగలరు.ఎవరికైనా సమస్యలు వస్తే వారికి బాగా సహాయపడతారు.
ఈ రోజు పుట్టిన ఆడవారైతే చాలా ప్రాశ్చాచ ధోరణిని కలిగి ఉంటారు.
లేకపోతే పాతవారిగా ఉంటారు.వీరి వివాహం చాలా తొందరపాటు నిర్ణయం కారణంగా జరుగుతుంది.ఆ తర్వాత బాధ పడతారు.
అందువల్ల తొందరపాటు లేకుండా అలోచించి నిర్ణయాలు తీసుకోవాలి.కాస్త అహంకారం ఉండుట వలన వీరికి స్నేహితులు చాలా తక్కువగా ఉంటారు.
వీరికి హృదయ,చర్మ,కాలేయ వ్యాధులు వచ్చే అవకాశం ఉంది.గురువారం, ఆదివారం, మంగళవారం మంచి రోజులు.
ఫిబ్రవరి 19 నుండి మర్చి దాకా మంచి రోజులే.ఆగస్టు, జనవరి, ఫిబ్రవరి నెలలు మంచివి కావు.
మధ్య వేలుకు నీలమణి ధరించాలి.
LATEST NEWS - TELUGU