కొన్ని కథలు నమ్మశక్యంగా ఉండవు.అవి చదివినప్పుడు ఇది నిజమేనా?….అన్న సందేహం కలుగుతుంది అందరిలో.కానీ ఇప్పుడు మీరు చదవబోయే కథ ముమ్మాటికీ నిజం.ఈ కథలో ముఖ్య పాత్ర సుమిత్ర దేవి.( Sumitra Devi ) ఈమె ఒక స్వీపర్.
జార్ఖండ్ రాష్ట్రం, రాజారప్ప లోని సిసిఎల్ టౌన్షిప్ లో 30 ఏళ్లుగా స్వీపర్ గా( Sweeper ) పనిచేస్తుంది.ఈమె కథ మనందరికీ స్ఫూర్తిదాయకం.
ఒక స్వీపర్ జీవితం స్ఫూర్తిని ఎలా ఇస్తుంది? అనుకుంటున్నారా.ఐతే ఇది చూడండి.
30 ఏళ్ళు స్వీపర్ గా పని చేసిన సుమిత్ర దేవి రిటైర్ అవ్వబోతోంది.ఆమె పదవి విరమణ రోజున ఆమె తోటి స్వీపర్లు, మున్సిపాలిటీ వారు, ఇరుగు పొరుగు వారు కలిసి ఒక చిన్న ఫంక్షన్ ఏర్పాటు చేసారు.
ఇంతలో అక్కడికి ఒక కారు వచ్చి ఆగింది.ఆ కార్లోనుంచి ఒక పెద్ద మనిషి వచ్చి ఆమె కాళ్లకు నమస్కరించాడు.ఆయన బీహార్ లోని శివాన్ జిల్లా కలెక్టర్.చూస్తున్న వాళ్లంతా ఆశ్చర్యపోయారు.
వాళ్ళు తేరుకునేలోపే మరో రెండు కార్లు వచ్చి ఆగాయి.అందులోనుంచి మరో ఇద్దరు దిగి వచ్చి కలెక్టర్ లాగానే ఆమె కళ్ళకు మొక్కారు.
ఆ ముగ్గురు సుమిత్ర దేవి కొడుకులు. ఇది ఎవ్వరు నమ్మలేని పచ్చి నిజం.
సుమిత్రాదేవి పెద్ద కొడుకు పేరు వీరేంద్ర కుమార్.( Veerendra Kumar ) ఆయన రైల్వే డిపార్ట్మెంట్ లో ఇంజినీరు గా పని చేస్తున్నాడు.రెండో కొడుకు ధీరేంద్ర కుమార్,( Dr.Dheerendra Kumar ) డాక్టర్.మూడో కొడుకు మహేంద్ర కుమార్,( IAS Mahendra Kumar ) ఈయనే ప్రస్తుతం బీహార్ లోని శివాన్ జిల్లా కలెక్టర్ గా ఉన్నారు.ఇలా తన ముగ్గురు కొడుకులు ఆమె పాదాలకు నమస్కిరంచగానే సుమిత్ర దేవి కన్నీళ్లు పెట్టుకుంది.ఆ కన్నీళ్లు బాధతో వస్తున్నవి కాదు.అవి ఆనందబాష్పాలు.
అనంతరం ఆ కార్యక్రమం లో మాట్లాడిన సుమిత్రాదేవి తన ఉన్నతాధికారులకు తన పిల్లలను పరిచయం చేసింది.తన పిల్లలు కూడు వాళ్ళ లాగానే పెద్ద అధికారులయ్యారని గర్వంగా చెప్పుకుంది.
విశేషం ఏమిటంటే…తన పిల్లలు ఎంత ఎత్తుకు ఎదిగిన ఆమె మాత్రం తన వృత్తిని వదలలేదు.ఈ విషయం పై మాట్లాతుడుతూ ఆమె తన పిల్లలు మంచి స్థాయిలో స్థిరపడినప్పటికీ తాను తన వృత్తిని వదలలేదని, దానికి కారణం తన పిల్లలను చదివించడానికి ఈ పనే ఆమెకు సహాయం చేసిందని చెప్పుకొచ్చింది.నిజానికి తన పిల్లలు గొప్పవాళ్ళయ్యాకా తనలో నిబద్ధత పెరిగిందని అన్నారు.ఈ కథలో కేవలం సుమిత్రా దేవి మాత్రమే కాదు…ఆమె పిల్లలు కూడా గొప్పవారి.వారు ఎంత గొప్ప స్థాయిలో ఉన్న తమ తల్లి ఒక స్వీపర్ అని చెప్పుకోవడాని వారు సిగ్గు పడలేదు.అంతే కాకుండా అందరిముందు ఆమె కాళ్ళ పై పడి నమస్కరించారు.
ఈ తల్లి.పిల్లలు.
మనందరికీ ఆదర్శం.ప్రపంచంలో ఏ పని చెయ్యడం చిన్నతనం కాదు.
నిజాయతి తో కష్టపడితే ఫలితం తప్పకుండ వస్తుంది.