ఎన్నో సంవత్సరాల నాటి విగ్రహం కోరిన కోరికలు వెంటనే తీర్చే సింధూర గణనాథుడు( Sindhura Ganapathi ) గురించి ఇప్పుడు తెలుసుకుందాం.ఈ దేవాలయం పేరు గణేష్ గడ్డ.
తెలంగాణ రాష్ట్రంలోని పటాన్‌చెరు మండలం రుద్రారం గ్రామంలో ఈ గణనాధుని దేవాలయం ఉంది.ఇక్కడ దక్షిణ ముఖ గణపతిగా భక్తులకు గణనాథుడు దర్శనం ఇస్తారు.
ఇక్కడి గణనాథుడు సంకటహర చతుర్థి రోజున విశేషంగా పూజలు అందుకుంటారు.కర్ణాటక సరిహద్దు ప్రాంతంలోని ప్రాచీనా పుణ్యక్షేత్రాలలో ఈ దేవాలయం ఒకటి.
ఈ దేవాలయంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి( Subramanyeswara Swmay )కి ముడుపు కట్టి 108 ప్రదక్షిణలు చేస్తే కోరిన కోరికలు వెంటనే తీరుతాయని చాలామంది ప్రజలు నమ్ముతారు.
అలాగే ప్రతి ఆదివారం లేదా మంగళవారం రోజు 11 వారాలపాటు 108 ప్రదక్షిణలు చేస్తుంటారు.దాదాపు 200 సంవత్సరాల క్రితం కర్ణాటక కు చెందిన శివరామ భట్టు అనే భక్తుడు తిరుమల వెళ్లాలని నిర్ణయించుకున్నాడు.అతను గణేశుడికి పరమ భక్తుడు.
సంకటహర చతుర్థి రోజు శివరామ బట్టు ఎక్కడుంటే అక్కడికి గణనాథుడు స్వయంగా వచ్చి పూజలు అందుకుంటాడని స్థానిక ప్రజలు చెబుతున్నారు.ఒకసారి భట్టు తిరుమల వెళ్తూ రుద్రారం అడవుల్లో( Rudraram Forest ) ఆగాడు.
అక్కడ సింధూరంతో స్వామి విగ్రహాన్ని తయారుచేసి పెట్టుకున్నాడు.
కొన్ని రోజుల తర్వాత ఆ విగ్రహాన్ని అడవిలోనే వదిలేసి భట్టు తిరుమల పాదయాత్ర( Tirumala Padayatra )కు వెళ్లాడు.కొన్నాళ్ళకు ఆ విగ్రహం కనుమరుగైపోయింది.ఒకసారి మఖందాస్ అనే భక్తుడు అడవిలో గుర్రంపై సంచరిస్తుండగా గణనాథుడు విగ్రహాన్ని చూసి ఆ గుర్రం కదలలేకపోయింది.
దాంతో ఆ విగ్రహం పక్కనే మఖందాస్ నిద్రపోయాడు.అప్పుడు అతని కలలో వినాయకుడు కనిపించి తనకు అక్కడే చిన్న గుడి కట్టాలని కోరాడు.
దాంతో మఖందాస్ వెంటనే గుడి కట్టించే పని మొదలుపెట్టాడు.అలా ఈ దేవాలయం ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంది.
ALERTS WHATSAPP