ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):
సూర్యోదయం: ఉదయం 05.45
సూర్యాస్తమయం: సాయంత్రం 06.47
రాహుకాలం:మ .1.30 ల3.00
అమృత ఘడియలు: ఉ.7.40 ల9.30 సా.4.00 ల6.00
దుర్ముహూర్తం: ఉ .10.14 ల.11.05 సా3.21 ల4.12
ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):
మేషం:
ఈరోజు మీరు సమాజంలో గౌరవాన్ని పొందుతారు.చేసే పనుల్లో విజయం సాధిస్తారు.సొంత నిర్ణయాలు తీసుకోకపోవడం మంచిది.
కొందరి అనుభవం ఉన్న వ్యక్తుల పరిచయాలు ఏర్పడతాయి.బయట ఒత్తిడి చాలా ఎక్కువగా ఉంటుంది
వృషభం:
ఈరోజు మీరు కొత్త వాహనం కొనుగోలు చేస్తారు.కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి.వ్యాపారస్తులు అధిక లాభాలు అందుకుంటారు.
మీ జీవిత భాగస్వామితో సరదాగా బయట సమయాన్ని కాలక్షేపం చేస్తారు.పిల్లల పట్ల జాగ్రత్తగా ఉండడం మంచిది.
మిథునం:
ఈరోజు మీరు ఆర్ధిక సమస్యల నుండి బయటపడతారు.అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు ఏవైనా వస్తువులు కొనుగోలు చేసే ముందు అనుభవం ఉన్న వ్యక్తులతో చర్చలు చేయడం మంచిది.ఇతరులతో వాదనలకు దిగకండి.
కర్కాటకం:
ఈరోజు వ్యవసాయదారులకు కలిసి వస్తుంది.మీరు ఏ పని మొదలు పెట్టిన త్వరగా పూర్తవుతుంది.కుటుంబ సభ్యులతో కలిసి యాత్రలకు వెళ్తారు.
దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.
సింహం:
ఈరోజు మీరు చెడు సవాసాలకు దూరంగా ఉండాలి.మీరు చేసే చిన్న చిన్న పొరపాట్ల వలన కుటుంబ సభ్యులు మానసిక ఒత్తిడికి గురవుతారు.భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని నిర్ణయాలు తీసుకోవడం మంచిది.బలహీనత మీలో ఎక్కువగా ఉంటుంది.
కన్య:
ఈరోజు మీ తండ్రి యొక్క ఆరోగ్యం కుదుట పడుతుంది.ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి.మీరు అంటే గిట్టని వారు మీపై నిందలు మోపుతారు.నిరుద్యోగులు ఉద్యోగం కోసం ప్రయత్నించాలి.మీరు అనుకున్న కోరికలు నెరవేరుతాయి.
తులా:
ఈరోజు మీరు కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయాన్ని గడుపుతారు.కొన్ని కొత్త పనులు ప్రారంభిస్తారు.ఆదాయం కన్నా ఎక్కువ డబ్బులు ఖర్చవుతాయి.
కానీ తిరిగి సంపాదించే సోమత మీలో ఉంటుంది.ఊహించని వ్యక్తుల పరిచయాలు ఏర్పడతాయి.
వృశ్చికం:
ఈరోజు మీరు విందు వినోదాల్లో పాల్గొంటారు.కొందరి ముఖ్యమైన వ్యక్తులు మిమ్మల్ని కలుస్తారు.మీరు చేసే ఉద్యోగంలో కొన్ని సమస్యలు ఎదురవుతాయి.అవిటినన్ని తట్టుకునే శక్తి మీలో ఉంటుంది.తీరికలేని సమయంతో గడుపుతారు.
ధనస్సు:
ఈరోజు మీ ఇంటికి బంధువులు వస్తారు.వారితో కలిసి దైవవదర్శనం చేసుకుంటారు.కొన్ని నిలిపి వెయ్యబడ్డ పనులు ఈరోజుతో పూర్తి చేస్తారు.
కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.గొప్ప ఫలితాలు ఉంటాయి.
మకరం:
ఈరోజుతో మీ కోర్టు సమస్యలు తీరిపోతాయి.ఇరుగు పొరుగు వారితో వాదనలకు దిగకండి.కుటుంబాల్లో కలహాలు అవుతాయి.ఖర్చులు తగ్గించుకోవడం మంచిది.ఇతరులు చెప్పే మాటలకు మోసపోకండి.చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది.
కుంభం:
ఈరోజు విద్యార్థులు పరీక్షల్లో విజయం సాధిస్తారు.కానీ ఏదో తెలియని బాధ మిమ్మల్ని మనసులో ఉండిపోతుంది.తల్లిదండ్రులతో కలిసి మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడాలి.బంధువుల నుండి ఒక శుభవార్త.ఆ శుభవార్త మిమ్మల్ని ఆనంద పరుస్తుంది.
మీనం:
ఈరోజు మీరు సంతానం పట్ల జాగ్రత్తగా ఉండాలి.దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది.మీరు చేసే పనుల్లో అడ్డంకులు జరిగే అవకాశం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి.
ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది.