సూర్యగ్రహణం సమయంలో మంచినీరు త్రాగకూడదా.. నిపుణులు ఏమి చెబుతున్నారంటే..!

ఈ సంవత్సరం మొదటి సూర్యగ్రహణం వైశాఖ అమావాస్య రోజు వచ్చింది.ఈ సూర్యగ్రహణం రోజున ఆహారం తినక పోవడమే కాకుండా మంచినీరు తాగకూడదని చాలామంది చెబుతూ ఉన్నారు.

 Shouldn't You Drink Fresh Water During Solar Eclipse What Experts Say , Scientif-TeluguStop.com

ఇప్పటికే సూర్యగ్రహణం ఏర్పడింది.ఈ సూర్యగ్రహణం ఉదయం ఏడు గంటలు నాలుగు నిమిషములకు మొదలై, మధ్యాహ్నం 12 గంటల 29 నిమిషములకు ముగుస్తుంది.

ఈ సూర్యగ్రహణం వైశాఖ అమావాస్య రోజు ఏర్పడింది.ఈ సూర్యగ్రహణాన్ని హైబ్రిడ్ సూర్యగ్రహణం అని కూడా అంటారు.

ఈ గ్రహణం భారత దేశంలో కనిపించదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.ఇది ఆస్ట్రేలియా, దక్షిణాసియా, అంటార్కిటికా, పసిఫిక్ మహాసముద్రం, హిందూ మహాసముద్రం వంటి దేశాల్లో కనిపిస్తుంది.

అయితే చంద్రగ్రహణం, సూర్యగ్రహణం( Lunar Eclipse, Solar Eclipse ) విషయంలో జనాలు కొన్నిటిని గుడ్డిగా నమ్మేస్తూ ఉంటారు.అయితే ఈ విషయాలపై నిపుణులు ఏమి చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.

Telugu Antarctica, Australia, Lunar Eclipse, Pacific Ocean, Solar Eclipse, Asia,

సనాతన ధర్మంలో కొందరు సూర్యగ్రహణం సమయంలో వండిన ఆహారం అపవిత్రమైనదని, తినకూడదని చెబుతూ ఉంటారు.ఏదేమైనా ఈ నమ్మకానికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు.అయితే గ్రహణం సమయంలో తినకుండా ఉండడానికి ఉన్న బలమైన ఏకైక కారణమేమిటంటే గ్రహణ వాతావరణ పీడనం,కాంతిలో మార్పులు వస్తాయి.దీని వల్ల సాధారణంగా మనకు ఆకలిగా అనిపించదు.

అందుకే ఈ సమయంలో తినడానికి ఆసక్తి చూపరని నిపుణులు చెబుతున్నారు.ముఖ్యంగా చెప్పాలంటే సూర్యగ్రహణం సమయంలో మంచి నీరు కూడా తాగకూడదని చాలామంది ప్రజలు చెబుతారు.

ఎందుకంటే ఈ సమయంలో నీళ్లను తాగితే ఆరోగ్యం చెడిపోతుందని చెబుతుంటారు.నిజం చెప్పాలంటే ఈ నమ్మకానికి కూడా ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు.

ఇంకా చెప్పాలంటే గ్రహణం తర్వాత మిగిలిపోయిన ఆహారాలను తినకూడదు.ఎందుకంటే సూర్యకిరణాల వల్ల ఆహారం కలుషితం అవుతుంది.

దీన్ని తింటే జీర్ణ సమస్యలు వస్తాయని పెద్దవారు చెబుతూ ఉంటారు.అలాగే మాంసాహారం, ఆల్కహాల్, ఉల్లిపాయ, వెల్లుల్లి లేదా పులియపెట్టిన ఆహారాలకు కూడా దూరంగా ఉండాలి.

ఎందుకంటే ఈ ఆహారాలను మన శరీరం జీర్ణించుకోవడం కష్టం అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube