మన హిందూ పురాణాలలో ఒక గరుడ పురాణానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది.సనాతన ధర్మంలో గరుడ పురాణాన్ని మహాపురాణంగా భావిస్తారు.
ఈ గరుడ పురాణం మనకు గరుడు, విష్ణుమూర్తి మనిషి జీవితం… మరణం.మరణం తర్వాత పరిస్థితులను గురించి తెలియజేస్తుంది.
అదేవిధంగా ధర్మం, యజ్ఞం శ్లోకాలు వంటి వాటి గురించి గరుడ పురాణంలో క్షుణ్ణంగా వివరించబడి ఉంటుంది.గరుడ పురాణంలో మనిషి చనిపోయిన తర్వాత తన ఆత్మ శరీరాన్ని వదిలి, స్వర్గానికి చేరేవరకు ఎదురయ్యే ప్రతి సంఘటన గురించి ఎంతో క్లుప్తంగా వివరించింది.
ఈ క్రమంలోనే మనిషి చనిపోయిన తరువాత గరుడ పురాణం ఇంట్లో చదివించడానికి గల కారణాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం…
సాధారణంగా మనిషి మరణించిన తర్వాత తన శరీరం నుంచి ఆత్మ బయటకు వెళ్తుంది.ఈ విధంగా కొందరు మరణించిన తర్వాత వారి ఆత్మలు వెంటనే వారి శరీరం నుంచి బయటకు వచ్చి మరొకరి శరీరంలోనికి ప్రవేశిస్తాయి.
మరికొన్ని ఆత్మలు ఇతర శరీరంలోకి ప్రవేశించాలంటే సుమారు 10 లేదా 13 రోజుల సమయం పడుతుందని గరుడ పురాణం మనకు తెలియజేస్తుంది.ఈ విధంగా మరణించిన వారి ఆత్మ వారి కుటుంబ సభ్యులను వదిలి వెళ్ళడానికి 13 రోజుల సమయం పడుతుంది.
అలాగే ఏదైనా ప్రమాదాల్లో మరణించిన వారి నుంచి వారి ఆత్మ బయటకు వెళ్లి తిరిగి పునర్జన్మ పొందడానికి సుమారు ఏడాది కాలం పడుతుందని గరుడపురాణం మనకు తెలుపుతుంది.

ఈ విధంగా మరణించిన వారి ఆత్మ తమ కుటుంబ సభ్యుల మధ్య తిరగడం వల్ల మన ఇంట్లో గరుడ పురాణం చదవడంతో మరణించిన వారి ఆత్మకు శాంతి కలుగుతుంది.అలాంటి వారు దెయ్యాలుగా మారకుండా వారి ఆత్మకు సంతోషం కలిగి వారి ఆత్మ స్వర్గానికి వెళుతుంది.ఈ విధంగా మనిషి మరణించిన తర్వాత వారి ఆత్మలు సంతోషపడి ఆత్మ దేవుని సన్నిధికి చేరుకోవాలని ఉద్దేశంతోనే మరణించిన వారి ఇంట్లో గరుడ పురాణాన్ని చదువుతారని పండితులు చెబుతున్నారు.