శ్రీశైలంలో బ్రహ్మోత్సవాల కోసం ముమ్మర ఏర్పాట్లు..

ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైలానికి ప్రతి రోజు ఎన్నో వేల మంది భక్తులు దేశ నలమూలల నుంచి వచ్చి బ్రహ్మోత్సవాలలో పాల్గొంటూ ఉంటారు.శ్రీశైలంలో ఫిబ్రవరి 11 నుంచి ఫిబ్రవరి 21వ తేదీ వరకు మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్లు దేవాలయ అధికారులు తెలిపారు.శివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్ల పై దేవస్థానం సిబ్బంది, స్థానిక తహసిల్దార్, వైద్య, పోలీసు అధికారులతో ఈవో లావణ్య ప్రాథమిక సమావేశాన్ని ఏర్పాటు చేశారు.11 రోజుల పాటు జరగనున్న బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు ప్రణాళిక రూపొందించుకోవాలని అధికారులకు ఆదేశించారు.

 Arrangements For Brahmotsavam In Srisailam , Srisailam Bhramarambika, Mallikarj-TeluguStop.com

పాదయాత్రగా వచ్చే భక్తులకు భీముని కొలను కైలాస ద్వారంలో అటవీ శాఖ సహకారం తో ఏర్పాట్లు చేయాలని వెల్లడించారు.వాహనాల పార్కింగ్ పోయిన సంవత్సరం కంటే ఎక్కువ పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేయాలని దేవాలయ సిబ్బందినీ ఆదేశించారు.భక్తులకు తాత్కాలిక వసతి తాగు నీరు, విశ్రాంతి షామియానాలను కూడా ఏర్పాటు చేయాలని చెప్పారు.బ్రహ్మోత్సవాల ప్రారంభానికి ముందే అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని కూడా పేర్కొన్నారు.

శ్రీశైలం భ్రమరాంబికా, మల్లికార్జున స్వామి అమ్మవార్ల పుణ్య క్షేత్రంలో పౌర్ణమి ప్రత్యేక వేడుకలను నిర్వహించారు.లోక కళ్యాణార్థం పరివార దేవతలకు అర్చనలు, అభిషేకాలు ఘనంగా జరిపించారు.ఉత్సవాల సమయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఇష్ట దైవాన్ని సందర్శించుకునేందుకు ఏర్పాట్లను చేస్తున్నారు.

శుక్రవారం రోజు సాయంత్రం పౌర్ణమి ఘడియల్లో దేవాలయ ప్రకారంలో క్షేత్ర గిరి ప్రదక్షణలు కూడా చేశారు.

అర్చక వేద పండితులు, భక్తులు, శివనామ స్మరణ చేశారు.నంది మండపం నుంచి బయలు దేరి వీరభద్ర స్వామి దేవాలయం మీదుగా శివనామస్వరన చేస్తూ సాగిన గిరి ప్రదక్షిణలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube