శ్రీ మహావిష్ణువు ఆశీస్సులను పొందాలంటే పద్మినీ ఏకాదశి రోజు ఇలా చేయాల్సిందే..?

ఆషాడమాసం శుక్లపక్ష ఏకాదశిని పద్మినీ ఏకాదశి అని కూడా అంటారు.పద్మినీ ఏకాదశి( Padmini Ekadashi ) ఎంతో విశిష్టత కలిగి ఉంటుంది.

 What Should Be Done On Padmini Ekadashi To Get The Blessings Of Lord Vishnu ,-TeluguStop.com

అయితే ఈ ఏడాది ఆ ఏకాదశి ఎప్పుడు వస్తుంది.దాని విశిష్టత ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

ముఖ్యంగా చెప్పాలంటే దీనిని సముద్ర ఏకాదశి అని కూడా అంటారు.ఈ ఏకాదశి శ్రీ మహా విష్ణువుకు ఎంతో ఇష్టమైనది.

ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వల్ల సంవత్సరం పొడవునా పుణ్యం లభిస్తుంది.ముఖ్యంగా చెప్పాలంటే ఈ సంవత్సరం పద్మినీ ఏకాదశి జులై 29వ తేదీన పద్మ ఏకాదశి వ్రతం పాటిస్తారు.

ఈ రోజు ఉపవాసం, దానధర్మాలు చేయడం వల్ల విశేషమైన పుణ్యఫలితం లభిస్తుంది.

Telugu Devotional, Lakshmi Devi, Lord Vishnu, River Bath-Latest News - Telugu

మిగిలిన మాసాలతో పోలిస్తే ఈ ఉపవాసంలో చేసే పూజకు పదిరెట్లా పుణ్యఫలం ఎక్కువగా లభిస్తుంది.పంచాంగం ప్రకారం ఆషాడం శుక్ల పక్షానికి చెందిన పద్మినీ ఏకాదశి జులై 28న రెండు గంటల 51 నిమిషములకు ప్రారంభమవుతుంది.మరుసటి రోజు జులై 29వ తేదీన ఒంటిగంట ఐదు నిమిషములకు ముగిసిపోతుంది.కాబట్టి పూజా జులై 29 వ తేదీన ఉదయం ఏడు గంటల 22 నిమిషముల నుంచి 9.04 నిమిషముల మధ్య లో పూజను మొదలుపెట్టాలి.పద్మిని ఏకాదశి వ్రతా పారాయణం ఉదయం 5:40 నుంచి 8:24 నిమిషముల మధ్యలో ప్రారంభించడం ఎంతో మంచిది.

Telugu Devotional, Lakshmi Devi, Lord Vishnu, River Bath-Latest News - Telugu

ఇంకా చెప్పాలంటే పద్మినీ ఏకాదశి రోజు ఉపవాసం ఉన్న వ్యక్తి శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహాన్ని కచ్చితంగా పొందుతాడు.ఈ వ్రతాన్ని మించిన త్యాగము, తపస్సు, దానధర్మాలు లేవని పురాణాలలో ఉంది.ఏకాదశి రోజు సూర్యోదయానికి ముందే నిద్రలేచి తీర్థ స్నానం చేయాలి.

నీటిలో కొన్ని నువ్వులు వేసి స్నానం చేయడం ఎంతో మంచిది.అలాగే కుంకుమ కలిపిన నీటితో విష్ణువు( Lord vishnu ) కు అభిషేకం చేయాలి.

ఈ రోజంతా ఉపవాసం లో భగవంతుని భజనలు, మంత్రాలు చదువుతూ ఉండాలి. ఉపవాస దీక్ష ముగిసిన తర్వాత బ్రాహ్మణులకు భోజనం పెట్టి వారికి తగిన రీతిలో సత్కరించి అప్పుడు మీ ఉపవాస దీక్షను విరమించడం వల్ల మీ జీవితంలో అంతా మంచే జరుగుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube