అందరి భయాలను పోగొట్టే శ్రీ ఆంజనేయస్వామి భవిష్యత్ బ్రహ్మ.ధర్మాన్ని, సత్యాన్ని ఆచరించడంలో ఆయన నిష్టాగరిష్టుడు.
శ్రీరామ నామ జపం విన్నంత మాత్రానే ఆయన ప్రసన్నుడు అవుతాడు.అనంతపురం జిల్లా కసాపురంలో వెలిసిన హనుమంతుడు భక్తులు కోరికలను తీర్చుతూ వారిపై చల్లని చూపును.
ప్రసరిస్తున్నాడు.దేశం నలు మూలల నుంచి ఇక్కడకు వేలాది మంది భక్తులు వస్తుంటారు.
అంతే కాకుండా వారి కష్టాల నుంచి గట్టెక్కిస్తుంటాడు.
స్థల పురాణం..16వ శతాబ్దంలో విజయ నగర సామ్రాజ్యాన్ని శ్రీకృష్ణ దేవరాయలు ప్రజారంజకంగా పరిపాలించేవాడు.ఒకసారి ఆయనకు కుహూ గండం ఏర్పడింది.ఆ సమయంలో రాజ్య పాలన చేయడం మంచిది కాదని జ్యోతిష్యులు చెప్పడంతో కొన్ని ఘడియలు రాజ్యపాలన చేసేందుకు కృష్ణదేవరాయల గురువైన వ్యాసరాయలు సింహాసనం అధిష్టించారు.
తరువాత తిరిగి కృష్ణదేవరాయలు రాజ్యాధికారాన్ని చేపట్టారు.కొన్ని ఘడియలు రాజ్యాధికారం చేసిన వ్యాసరాయలు విజయనగరాన్ని వదలి తీర్ధ యాత్రకు బయలు దేరుతాడు.ఆయనకు ఆంజనేయస్వామి మీద భక్తి ఎక్కువ.యాత్రలో భాగంగా ఆయన కర్నూలు జిల్లాలోని చిప్పగిరి (శిల్పగిరి) చేరుకుంటాడు.
అయితే ఒక నాటి రాత్రి ఆంజనేయ స్వామి కలలో కనిపించి.సమీపంలోని నెట్టికల్లు (కసాపురం) గ్రామంలో ఎండుపుల్ల చిగురించిన చోట గుడి కట్టించమని ఆజ్ఞాపించాడట.
మరుసటి దినం రాయలవారు నెట్టికల్లు గ్రామాన్ని సందర్శించి స్వామికి ప్రీతికరమైన స్థలం కనుగొని అక్కడ విగ్రహ ప్రతిష్టాపన చేశారు.నెట్టికల్లు గ్రామం వద్ద గుడి ఉండడం వల్ల నెట్టికంటి ఆంజనేయస్వామి అని స్వామికి పేరు వచ్చింది.
నెట్టికల్లు గ్రామం కాలగర్భంలో కలిసిపోయిందని చెప్పడానికి ఆనవాళ్లు కూడా ఉన్నాయి.ఆ గ్రామానికి అనుకునే కసాపురం ఉంది.
దీంతో స్వామిని కసాపురం ఆంజనేయ స్వామి అని పిలుస్తారు.