తిరుమలలో రద్దీ నేపథ్యంలో అదనపు సిబ్బందిని నియమించామని టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి పేర్కొన్నారు.వారంతాల్లో నాలుగు రోజులు బ్రేక్ దర్శనాలు రద్దు చేయనున్నట్టు వెల్లడించారు.
దర్శనానికి వచ్చే భక్తులకు నీరు, ఆహారం అందిస్తున్నట్టు తెలిపారు.త్వరలో లగేజీ కేంద్రాల ఏర్పాటుకు టెండర్లు ఆహ్వానిస్తామని ప్రకటించారు.
ఈనెల 11 నుండి 17 వరకు 5,29,966 మంది భక్తులు దర్శించుకున్నారని ధర్మారెడ్డి వెల్లడించారు.వారం రోజుల్లో 24,37,744 లడ్డూలు విక్రయించామన్నారు.వారం రోజుల హుండీ ఆదాయం 32.50 కోట్లు వచ్చిందన్నారు.త్వరలోనే స్లాట్ సర్వదర్శనం పునః ప్రారంభంపై నిర్ణయం తీసుకుంటామని ధర్మారెడ్డి వెల్లడించారు.