థాయిలాండ్ ఒక అందమైన దేశం.ఈ దేశం గురించి మీరు ఎప్పుడైనా మీ స్నేహితులు, బంధువులు చెబుతుంటే విని ఉంటారు.
పర్యాటక ప్రదేశాలకు సంబంధించిన చర్చ వచ్చినప్పుడు థాయిలాండ్ తప్పకుండా గుర్తుకు వస్తుంది.థాయిలాండ్ పర్వతాలు, సముద్రాలతో కూడిన ఆగ్నేయాసియా దేశం.
మీరు థాయిలాండ్ గురించి ఇంటర్నెట్‌లో చాలా విషయాల గురించి వినే ఉంటారు.అయితే థాయిలాండ్ గురించి మీకు తెలియని చాలా విషయాలు ఉన్నాయి.
ఇప్పుడు మనం ఈ కథనం ద్వారా థాయ్‌లాండ్‌కు సంబంధించిన 10 ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం.వాటి గురించి వింటే మీరు ఆశ్చర్యపోతారు.
అవేమిటో ఇప్పుడు చూద్దాం.
ఇప్పటివరకు ఏ యూరోపియన్ దేశం థాయ్‌లాండ్ దేశాన్ని బానిసగా మార్చలేకపోయింది.
థాయిలాండ్‌లోని మత గ్రంథం పేరు రామకిన్.ఇది హిందూ ఇతిహాసం రామాయణానికి థాయ్ వెర్షన్.
ప్రపంచంలోనే అతిపెద్ద బియ్యం ఎగుమతి చేసే దేశం థాయ్‌లాండ్ అని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు.లోదుస్తులు లేకుండా థాయ్‌లాండ్‌లో నడవలేరు.లోదుస్తులు లేకుండా ఇక్కడ నడవడం చట్టవిరుద్ధం.అలా ప్రవర్తించినవారికి శిక్ష పడుతుంది.బౌద్ధమతాన్ని అనుసరించే 96% మంది ప్రజలు థాయ్‌లాండ్‌లో నివసిస్తున్నారు.ఇక్కడ ముస్లిం జనాభా 4% మాత్రమే.
ప్రపంచంలో థాయిలాండ్ అత్యంత ప్రముఖ, అత్యంత ప్రసిద్ధ పర్యాటక కేంద్రం.థాయిలాండ్ రాజధాని పేరు బ్యాంకాక్.
ప్రపంచంలోనే ఇది అత్యంత హాటెస్ట్ ప్లేస్.బ్యాంకాక్‌లో ఏప్రిల్ నెలలో అత్యంత వేడిగా ఉంటుంది.
భారతదేశంలో జరుపుకునే హోలీ పండుగను ఏప్రిల్ నెలలో థాయ్‌లాండ్‌లో సాంగ్‌క్రాన్ పేరిట జరుపుకుంటారు.ఈ పండుగను నీటిలో తడుస్తూ చేసుకుంటారు.
థాయ్‌లాండ్‌లో బంగారంతో చేసిన అతిపెద్ద బుద్ధుడి విగ్రహం ఉంది.ప్రపంచంలోనే అతిపెద్ద షార్క్ చేప థాయిలాండ్ సముద్రంలో కనుగొన్నారు.
దీని పొడవు 12 మీటర్ల కంటే అధికం







