నిద్రలో వచ్చే ఈ కలల గురించి పొరపాటున కూడా ఇతరులకు చెప్పకండి..

సాధారణంగా చాలామంది ప్రజలకు నిద్రలో కలలు వస్తూ ఉంటాయి.కలలు కనడానికి కలల నిద్రలో వచ్చే కలలు ఎక్కడి నుంచో ఎక్కడికో తీసుకెళ్ళిపోతూ ఉంటాయి.

 Do Not Tell Others About These Dreams Even By Mistake , Dreams  ,sleep Dreams ,-TeluguStop.com

ఇలా జరుగుతుందా అని డౌట్ వచ్చేలా కలలు వస్తూ ఉంటాయి.వాస్తవానికి కలలు కనడం ఎవరి ఆధీనంలో ఉండదు.

నిద్రపోయే ముందు ఏం ఆలోచిస్తామో నిద్రలో అదే ఆలోచన కల రూపంలో వస్తుందని కూడా చెబుతూ ఉంటారు.

అసాధ్యం అనుకున్న విషయాన్ని సుసాధ్యం చేసే మరో ప్రపంచమే కలల ప్రపంచం.

అయితే వచ్చిన కల వచ్చినట్టు కొంత మంది ఇతరులకు చెప్పేస్తుంటారు.కానీ కొన్ని కలలు మాత్రం షేర్ చేసుకోకూడదని స్వప్న శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

ఈ కలలను ఎవరికి చెప్పకపోవడం వల్ల ప్రయోజనం పొందుతారని చెబుతున్నారు.అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

చాలామందికి వచ్చే కలలలో కొన్ని భయంకరమైన కలలు వస్తూ ఉంటాయి.మనం చనిపోయినట్టు మనకే కల రావడం చనిపోయిన తర్వాత కూడా మన చుట్టూ ఏం జరుగుతుందో తెలిసిపోతూ ఉంటుంది.ఈ కల రాగానే చాలామంది భయపడుతూ ఉంటారు.కానీ అది శుభ సూచకమే అని స్వప్న శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.ఇలాంటి కల మీ ఇంటికి వచ్చే సంతోషాన్ని సూచిస్తుందని ఇది ఎవరితోనైనా షేర్ చేసుకోకూడదని చెబుతూ ఉంటారు.

తల్లిదండ్రులకు సేవ చేస్తున్నట్లు కొంతమందికి కలలు వస్తూ ఉంటాయి.అయితే ఇలాంటి కల కూడా మీ జీవితంలో పురోగతిని సూచిస్తుందని స్వప్న శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.ఈ కలను కూడా ఎవరితో పంచుకోవద్దని అలా పంచుకుంటే ప్రయోజనం పొందలేరని చెబుతున్నారు.

కలలో దేవుడు దర్శనం చేసుకున్నట్లు కల వస్తే, ఇలాంటి కల వస్తే కెరియర్ పరంగా మీకు మంచి జరగబోతుందని అర్థం చేసుకోవచ్చు.ఈ కల కూడా ఎవరికీ చెప్పకూడదని స్వప్న శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube