డీఎన్ఏ పరీక్షల ద్వారా చిన్నారుల కెరీర్ ప్రణాళిక చేసుకోవచ్చా..?

సాధారణంగా ప్రతి చిన్నారికి ప్రత్యేక నైపుణ్యాలు ఉంటాయి.అయితే వాటిని గుర్తించి వారిని ఆ రంగంలో శిక్షణ అందించేందుకు అద్భుతాలు సృష్టించడం పెద్ద పని ఏమీ కాదు.

 Can Children's Career Be Planned Through Dna Tests , Dna Tests, Children's Caree-TeluguStop.com

అయితే పిల్లలలో సామర్థ్యాలను గుర్తించి వారిని ఆయా రంగాల్లో ఉన్నతులుగా తీర్చిదిద్దడం చాలా కష్టమైన పని.ఇందుకోసం భారత అమెరికన్ వ్యాపారవేత్త మహమ్మద్ ముస్తఫా( Mohammed Mustafa ) ఓ సాఫ్ట్ వేర్ ను రూపొందించారు.ఈ సాఫ్ట్ వేర్ పిల్లల లాలాజలం నుండి సేకరించిన జన్యువులను విశ్లేషించడం వలన వారికి అనువైన కెరీర్ ప్రణాళికను సూచిస్తుందట.దీంతో పిల్లలకు 10-15 సంవత్సరాల వయస్సు వరకు వారికి నైపుణ్య ప్రణాళికలను సాఫ్ట్ వేర్ ద్వారా అందించగలరని వారు చెప్పారు.

Telugu Dna, Tips, Indian System-Telugu Health

ముస్తఫా రూపొందించిన ఈ సాఫ్ట్ వేర్ పిల్లల్లోని జన్యువుల విశ్లేషణ( Analysis of genes ) పై ఆధారపడి ఉంటుంది.అలాగే వారు ఎలాంటి నైపుణ్యం కలిగి ఉన్నారో గుర్తించవచ్చు.అలాగే వారికి అనువైన కెరీర్ ప్రణాళిక వేసుకునే అవకాశం ఉంది.అయితే దీని ఆధారంగా సంబంధిత చిన్నారికి ప్రత్యేకమైన పాఠశాల విద్యను కూడా అందించవచ్చని, దీని వలన మెరుగైన భారతదేశాన్ని నిర్మించగలమని మొహమ్మద్ ముస్తఫా వివరించారు.

అయితే పిల్లల సామర్థ్యాన్ని జన్యువుల ద్వారా తెలుసుకోవడానికి వారు పూర్తిస్థాయిలో జీన్ మ్యాపింగ్ చేశారని ముస్తఫా తెలిపారు.

Telugu Dna, Tips, Indian System-Telugu Health

భారత్ విద్యా వ్యవస్థతో( Indian education system ) పాటు ప్రపంచవ్యాప్తంగా ప్రతి చిన్నారికి అన్ని బోధించడం చాలా అవసరం.అలాగే తర్వాతి దిశలో కూడా కొన్ని దేశాలు మేథో పరీక్షలు నిర్వహించి పిల్లల సామర్థ్యాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి.వాటి ఆధారంగా చిన్నారుల కెరీర్ నిర్ణయిస్తున్నారు.

అయితే తాజాగా భారత అమెరికన్ వ్యాపారవేత్త మహమ్మద్ ముస్తఫా రూపొందించిన ఈ సాఫ్ట్ వేర్ ద్వారా 10-15 ఏళ్ల వరకు చిన్నారుల కెరీర్ ను స్వయంగా మనమే ప్రణాళిక చేసుకునే అవకాశం రావడం గమనార్హం.అయితే ఇప్పటివరకు దీన్ని ఉపయోగించలేదు.

అయినప్పటికీ ఇది దేశాల్లోని ప్రతిభను సరైన మార్గంలో నిర్మించడంలో సహాయపడుతుందని ముస్తఫా తో పాటు పలువురు చెప్పుకొచ్చారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube