క‌డుపులో నులి పురుగులు పోవాలా..ఇలా చేస్తే స‌రి!

క‌డుపులో నులి పురుగులు.ముఖ్యంగా ఈ స‌మ‌స్య చిన్న పిల్ల‌ల్లో అత్య‌ధికంగా క‌నిపిస్తుంటుంది.

చాలా అరుదుగా మాత్రమే పెద్ద‌ల్లో ఈ నులి పురుగుల స‌మ‌స్య ఉంటుంది.అపరిశుభ్రత వ‌ల్లే క‌డుపులో నులి పురుగులు ఏర్ప‌డ‌తాయి.

ఇక ఈ నులి పురుగులు ఉంటే.త‌ర‌చూ క‌డుపు నొప్పి రావ‌డం, రోగ నిరోధ శ‌క్తి త‌గ్గిపోవ‌డం, నీర‌సం, రక్తహీనత, రోజురోజుకీ బక్కచిక్కి పోవడం, పోష‌కాలు గ్ర‌హించే శ‌క్తి త‌గ్గిపోవ‌డం, విరోచనాలు, ఆకలి లేకపోవడం ఇలా ర‌క‌ర‌కాల స‌మ‌స్య‌లు ఏర్ప‌డ‌తాయి.

అందుకే క‌డుపులో నులి పురుగులు ఉంటే.వాటిని నివారించుకోవ‌డం చాలా అవ‌స‌రం.

Advertisement

అయితే వైద్య ప‌రంగానే కాకుండా.కొన్ని కొన్ని ఇంటి చిట్కాలు పాటిస్తూ కూడా నుల్లి పురుగుల‌ను పోగొట్టుకోవ‌చ్చు.

మ‌రి ఆ చిట్కాలు ఏంటో లేట్ చేయ‌కుండా ఇప్పుడు తెలుసుకుందాం.క‌డుపులో నులి పురుగులు ఉన్న వారు ఒక గ్లాస్ వేడి పాల‌లో ప‌చ్చ బొప్పాయి పేస్ట్ మ‌రియు తేనె వేసి బాగా క‌లిపి సేవించాలి.

ఇలా చేయ‌డం వ‌ల్ల నులి పురుగులు క్ర‌మంగా నాశ‌నం అవుతాయి.

అలాగే నులి పురుగుల నివారణకు సీతాఫలం అద్భుతంగా స‌హాయ‌ప‌డుతుంది.కాబ‌ట్టి, ప్ర‌తి రోజు బాగా పండిన సీతాఫ‌లాన్ని తీసుకుంటే.నులి పురుగులు పోతాయి.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?

పైగా సీతాఫలం తీసుకుంటే శ‌రీరాన్ని ఎన్నో విట‌మిన్స్‌, మిన‌ర‌ల్స్ అందడంతో పాటు ఇమ్యూనిటీ ప‌వ‌ర్‌ కూడా పెరుగుతుంది.వెల్లుల్లి కూడా నులి పురుగుల నివార‌ణ‌లో గ్రేట్‌గా స‌హాయ‌ప‌డ‌తాయి.

Advertisement

అందువ‌ల్ల, వెల్లుల్లిని తేనెతో క‌లిపి తీసుకోవ‌డం లేదా ఏదో ఒక విధంగా తీసుకుంటే నులి పురుగులు నాశ‌నం అవుతాయి.నులి పురుగులు ఉన్న వారు ఎప్పుడూ గోరు వెచ్చ‌ని నీటిని తీసుకోవాలి.

ఇక నులి పురుగులు ఉన్న వారు ప్ర‌తి రోజు ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని నీటిలో చిటికెడు ప‌సుపు క‌లిపి తీసుకోవాలి.ఇలా చేసినా మంచి ఫ‌లితం ఉంటుంది.

అయితే ఈ టిప్స్‌తో పాటు వైద్యులు సూచించిన మందులు కూడా వాడాలి.

తాజా వార్తలు