ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ దర్శకులు అందరూ కూడా బాలీవుడ్( Bollywood ) బాట పడుతున్నారు.దానికి కారణం ఏంటి అనేది ప్రస్తుతం కొంతమందికి అర్థం కావడం లేదు.
నిజానికి మన స్టార్ డైరెక్టర్లు అందరూ కూడా ఇక్కడ తెలుగులో సినిమాలు చేసి మంచి గుర్తింపును సంపాదించుకున్నారు.కానీ ఆ తర్వాత బాలీవుడ్ హీరోలతో సినిమాలు చేస్తూ మంచి విజయాలను అందుకునే ప్రయత్నం చేస్తున్నారు.
ఇక దానికి గల ముఖ్య కారణం ఏంటి అంటే మన తెలుగు హీరోలు( Telugu Heroes ) అందరూ కూడా చాలా బిజీగా ఉండడం వల్ల వాళ్లతో సినిమాలు చేసే అవకాశాలు వీళ్లకు రావడం లేదు.
అందువల్లే వాళ్ళు అందులో భాగంగానే బాలీవుడ్ మీద ఫోకస్ పెడుతున్నారు.ఇక అందులో భాగంగానే గోపి చంద్ మలినేని( Gopichand Malineni ) లాంటి డైరెక్టర్ కూడా ఇప్పుడు సన్నీ డియోల్ తో( Sunny Deol ) ఒక సినిమా చేస్తున్నాడు.అలాగే ఇంతకు ముందు సందీప్ రెడ్డి వంగా( Sandeep Reddy Vanga ) కూడా రన్బీర్ ర్ కపూర్ తో అనిమల్ అనే సినిమా చేశాడు.
ఇక ఇప్పుడు ప్రశాంత్ వర్మ( Prasanth Varma ) కూడా రన్వీర్ సింగ్ తో( Ranveer Singh ) ఒక సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు.ఇలా మన స్టార్ డైరెక్టర్లందరూ కూడా బాలీవుడ్ లో సినిమాలు చేయడం పట్ల తెలుగు అభిమానులు అందరూ కొంతవరకు ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు…
ఇక మొత్తానికైతే వీళ్ళు కనక ఈ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నట్లయితే బాలివుడ్ లోనే వీళ్ళకు మంచి గిరాకీ పెరిగే అవకాశాలైతే ఉన్నాయి.అయితే తెలుగు లో కేవలం ఆరుగురు మాత్రమే స్టార్ హీరోలు ఉండటం వల్ల అందరికీ వాళ్లతో సినిమాలు చేసే అవకాశం రావడం లేదు.అందువల్లే వారు నిరశ చెందకుండా బాలీవుడ్ హీరోల మీద ఫోకస్ చేస్తున్నారు…చూడాలి మరి వీళ్లలో ఎవరు సక్సెస్ అవుతారు అనేది…
.